News October 1, 2024
వైసీపీలో తాడేపల్లిగూడెం నాయకుడికి కీలక బాధ్యతలు
వైసీపీ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన వడ్డీ రఘురాం నాయుడును నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం తాడేపల్లిగూడెంలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గతంలో రఘురాం నాయుడు ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆయన నియామకం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
Similar News
News October 7, 2024
ప.గో: TODAY TOP HEADLINES
*భీమవరం: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
*తాడేపల్లిగూడెం: హత్య కేసులో నిందితుడు అరెస్ట్
*చింతలపూడి: పేకాట శిబిరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్
*ప.గో: పేరుపాలెం బీచ్‌లో పర్యాటకుల సందడి
*ఏలూరు: వ్యక్తిపై దాడి చేసిన 9 మంది అరెస్ట్
*నరసాపురం: లారీని ఢీకొన్న RTCబస్సు.. సీసీ ఫుటేజ్
*తాడేపల్లిగూడెంలో యువకుడు మృతి
*ఉండి: లక్ష దాటిన బీజేపీ సభ్యత్వాలు
*500 రక్తపరీక్ష కిట్లను అందజేసిన ఎమ్మెల్యే చింతమనేని
News October 6, 2024
తిరుపతి వెంకన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే RRR
ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు ఆదివారం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయనకు వేద ఆశీర్వచనాలు అందజేశారు.
News October 6, 2024
నరసాపురంలో పదేళ్ల బాలికతో అసభ్యకర ప్రవర్తన
పదేళ్ల బాలికపట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై శనివారం పోక్సో కేసు నమోదుచేశామని నరసాపురం పట్టణ ఎస్సై జయలక్ష్మి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఓ ప్రాంతానికి చెందిన బాలికపట్ల యలమంచిలి మండలం మేడపాడుకు చెందిన యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనిపై బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నామని ఎస్సై తెలిపారు.