News February 13, 2025
వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్‌గా కన్నబాబు

వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్‌గా మాజీ మంత్రి కురసాల కన్నబాబును నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం కమిటీ ప్రకటన జారీ చేసింది. వైసీపీ హయాంలో కన్నబాబు మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో విశాఖ జిల్లా ఇన్‌ఛార్జిగా కూడా కొనసాగారు. వైసీపీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో కన్నబాబు నియామకం చేపట్టారు.
Similar News
News February 27, 2026
విశాఖ: లారీ డ్రైవర్ ఆత్మహత్య

తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్, గాజువాక బెల్ కంపెనీ ఎదురుగా ఉన్న మైదానంలోని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లారీతో కంపెనీకి వచ్చిన విజ్జి అనే డ్రైవర్ అడ్మిన్ బిల్డింగ్ ఎదురుగా మైదానంలో లారీ ఆపి శుక్రవారం ఉదయం లారీ క్యాబిన్ తలుపుకి తాడు కట్టి ఉరివేసుకున్నాడు. విషయం తెలుసుకున్న గాజువాక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News February 27, 2026
మాంసం వ్యర్థాల మాయాజాలం.. కాంట్రాక్టర్లకు జీవీఎంసీ చెక్

మాంసం వ్యర్థాల ద్వారా GVMCకు వచ్చే ఆదాయం కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్తున్న వ్యవహారంపై అధికారులు దృష్టి సారించారు. రోజుకు 10-15 టన్నులు, ఆదివారం 30 టన్నుల వరకు వ్యర్థాల సేకరణ జరుగుతున్నట్టు నెల రోజుల సర్వేలో తేలింది. ఇవి కాపులుప్పాడకు తరలించాల్సి ఉండగా గోదావరి జిల్లాల చేపల చెరువులకు మళ్లుతున్నట్లు గుర్తించారు. ఇకపై వీటిని కాపులుప్పాడ డంపింగ్ యార్డులోనే టెండర్ ద్వారా విక్రయించాలని నిర్ణయించారు.
News February 27, 2026
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: విశాఖ సీపీ

మాదకద్రవ్యాలకు బానిసవ్వడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, భవిష్యత్తు, అవకాశాలు కోల్పోతారని సీపీ శంఖబ్రత బాగ్చి యువతను ఉద్దేశించి మాట్లాడారు. విశాఖలో గురువారం జరిగిన కార్యక్రమంలో సీపీ పాల్గొన్నారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉంటూ తమ భవిష్యత్తును కాపాడుకునేలా సరైన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు.. ప్రతీ విద్యార్థి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా వారియర్స్‌గా మారాలన్నారు.


