News March 13, 2025
‘వైసీపీ ఉనికి కోసమే యువత పోరు చేపట్టింది’

నంద్యాల: రాష్ట్రంలో 2024లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ కేవలం ఉనికి కోసమే యువత పోరు కార్యక్రమం చేపట్టిందని యూనివర్సల్ స్టూడెంట్ యూత్ యూనియన్ అధ్యక్షుడు ముద్దం నాగ నవీన్ మండిపడ్డారు. యువత జీవితాలను నాశనం చేయాలని జగన్ రెడ్డి కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాడన్నారు. తన హయాంలో నిరుద్యోగ శాతం పెంచి.. ఇప్పుడు ఫీజు పోరు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Similar News
News March 24, 2025
క్యాన్సర్ కేసులపై ప్రచారంలో నిజం లేదు: మంత్రి

AP: రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. అనపర్తి నియోజకవర్గంలో 105 మందికి క్యాన్సర్ సోకినట్లు తేలిందని చెప్పారు. బ్రెస్ట్, సర్వైకల్, బ్లడ్, ఓరల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. అనపర్తిని యూనిట్‌గా తీసుకొని ఇప్పటివరకు 1.19 లక్షల మందికి స్క్రీనింగ్ చేశామన్నారు.
News March 24, 2025
KMR: దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

పెండింగ్‌లో ఉన్న ధరణీ దరఖాస్తులను పరిశీలించి డిస్పోజ్ చేయాలని తహశీల్దార్లు, ఆర్డీఓలును సోమవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సిద్ధంగా ఉంటే వెంటనే మార్క్ అవుట్ ఇవ్వాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు పరిశీలించాలని, ఎంపీడీవోలు, ఎంపీఓలు పర్యవేక్షించాలన్నారు.
News March 24, 2025
జగిత్యాల: ఇంగ్లిష్ పరీక్షకు 8 మంది గైర్హాజరు

జగిత్యాల జిల్లాలో పదోతరగతి పబ్లిక్ పరీక్షలలో భాగంగా మూడోరోజు ఇంగ్లిష్ పేపర్ రెగ్యులర్ పరీక్షకు మొత్తం 11845 విద్యార్థులకు 11839 విద్యార్థులు హాజరయ్యారు. ఆరుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. రెగ్యులర్ విద్యార్థుల హాజరు శాతం 99.95% ఉండగా.. సప్లమెంటరీ విద్యార్థులకు సంబంధించిన పరీక్ష కేంద్రాలలో 27 విద్యార్థులకు 25 మంది విద్యార్థులు గైర్హజరయ్యారు. వీరి హాజరుశాతం 85.19%. ఉంది అని అధికారులు తెలిపారు.