News July 23, 2024

వైసీపీ ఎమ్మెల్సీకి శాసనమండలిలో విపక్షనేత హోదా

image

ఎమ్మెల్సీ అప్పిరెడ్డి జగన్ ప్రభుత్వం హయాంలో సాధారణ ఎమ్మెల్సీ, YCP కార్యాలయ కార్యదర్శిగా ఉన్నారు. మాజీ సీఎం జగన్‌తో పోల్చుకుంటే అప్పిరెడ్డి స్థాయి చిన్నది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. శాసనమండలిలో అప్పిరెడ్డిని ప్రతిపక్ష నేతగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడంతో ఆ హోదాకు తగినట్టు అప్పిరెడ్డికి ప్రత్యేక ఛాంబర్, ప్రోటోకాల్, గౌరవం మర్యాదలు లభిస్తాయి. కానీ YCP అధ్యక్షుడు జగన్‌కు మాత్రం ఇవేమీ ఉండవు.

Similar News

News November 20, 2025

ధాన్యం ఆఖరి గింజ వరకూ కొంటాం: మంత్రి నాదెండ్ల

image

జిల్లాలోనే తొలిగా కొల్లిపర మండలం దావులూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్ర గురువారం ప్రారంభమైంది. రైతు సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. కలెక్టర్ తమీమ్ అన్సారియాతో పాటు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో కలిసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతులతో ఆయన మాట్లాడారు. రైతులు ధైర్యంగా ఉండాలని మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు.

News November 19, 2025

గరుడ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ

image

వెలగపూడి సచివాలయంలోని గరుడ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం పరిశీలించారు. వీవీఐపీ బందోబస్తు, ట్రాఫిక్ పర్యవేక్షణలో కేంద్రం కీలకమని పేర్కొంటూ పనిచేయని కెమెరాలను వెంటనే పునరుద్ధరించాలని, డ్రోన్ గస్తీని కట్టుదిట్టం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు-కరకట్ట మార్గాల్లో రాకపోకలకు అంతరాయం లేకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు.