News September 8, 2024
వైసీపీ ఏ ప్రాజెక్టులను మెయింటెనన్స్ చేయలేదు: సీఎం
అత్యంత క్లిష్టమైన బుడమేరు గండ్లను పూడ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. 4 రోజులుగా మంత్రులు నిమ్మల రామానాయుడు, నారా లోకేష్ కలిసి ఈ పనులు పూర్తి చేశారని పేర్కొన్నారు. దీంతో ఇన్‌ఫ్లో పూర్తిగా ఆగిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఏ ప్రాజెక్టులను మెయింటెనన్స్ సరిగా చేయలేదని ఆరోపించారు.
Similar News
News October 10, 2024
జగ్గయ్యపేట వ్యక్తికి వైసీపీలో కీలక పదవి
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జగ్గయ్యపేటకు చెందిన ఇంటూరి రాజగోపాల్ (చిన్నా)ను వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించనున్నట్లు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇంటూరి చిన్నా జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్‌గా పనిచేశారు.
News October 10, 2024
కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. హాల్ టికెట్లు విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో పీజీ, డిగ్రీ, డిప్లొమా తదితర కోర్సులు(సెమిస్టర్ బేస్డ్) చదివే విద్యార్థులు అక్టోబర్‌లో రాయాల్సిన పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. http://anucde.info/halltickets.php అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్థులు తమ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని యూనివర్సిటీ పరీక్షల విభాగం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. Shareit
News October 10, 2024
కృష్ణా: రైతు బజార్‌లలో అతి తక్కువ ధరకు వంట నూనె
పెరుగుతున్న ధరల నియంత్రణలో భాగంగా నేటి నుంచి జిల్లాలోని అన్ని రైతు బజార్‌లలో వంట నూనె, టమాటాలు తక్కువ ధరకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించనున్నట్లు కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు. సన్ ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ.124, పామోలిన్ లీటరు రూ.114లకు, కేజీ టమాటాలు రూ.50లకు విక్రయించనున్నట్టు చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.