News February 11, 2025

వైసీపీ కార్యాలయానికి మరోసారి నోటీసులు

image

తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి పోలీసులు మరోసారి నోటీసులు అందజేశారు. ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన రోజు కార్యాలయానికి వచ్చిన సందర్శకులు, నేతల జాబితా ఇవ్వాలని పార్టీ కార్యాలయ వర్గాలను పోలీసులు కోరారు. అలాగే సీసీ కెమెరా డేటా, పార్కింగ్ లోని వాహనాల వివరాలతో మంగళవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి పీఎస్‌కు రావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.

Similar News

News February 27, 2026

రేపటితో ముగియనున్న గుంటూరు మెడికల్ కాలేజీ మెడికల్ ఎగ్జిబిషన్

image

గుంటూరులో ముప్పై ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న గుంటూరు మెడికల్ కాలేజీ మెడికల్ ఎగ్జిబిషన్ రేపటితో ముగియనుంది. ఫిబ్రవరి 4న ప్రారంభమైన ఈ ప్రదర్శనకు ఇప్పటివరకు సుమారు 80 వేల మంది హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ సందర్శించి అభినందించారు. చివరి రోజున ప్రజలు తప్పక వీక్షించాలని ప్రిన్సిపల్ డా. సుందరాచారి కోరారు. మరుపురాని వైద్య విజ్ఞాన అనుభూతిని పొందినట్లు పలువురు సందర్శకులు పేర్కొన్నారు.

News February 27, 2026

GNT: ప్రైవేట్ స్కూళ్లలో 25% ఉచిత సీట్లు.. దరఖాస్తుల ఆహ్వానం

image

వచ్చే విద్యాసంవత్సరానికి ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతి ఉచిత అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జియావుద్దీన్ తెలిపారు. అర్హులైన వారు మార్చి 10వ తేదీలోగా cse.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శుక్రవారం జిల్లా కోర్టులో దీనికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. నిరుపేద విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

News February 27, 2026

వీధి కుక్కల నియంత్రణపై చర్యలు చేపట్టాలి: GNT కలెక్టర్

image

వీధి కుక్కలపై ప్రజల నుంచి అధికంగా ఫిర్యాదులు అందుతున్నాయని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. పరిష్కరించేందుకు అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వీధి కుక్కల నియంత్రణపై గురువారం సమావేశం నిర్వహించారు. వీధి కుక్కల వలన చిన్న పిల్లలు ఆడుకోవాలన్నా భయపడుతున్నారని, పగలు, రాత్రి తేడా లేకుండా శునకాలు ప్రజలపై దాడి చేస్తున్నాయని వాటి నుంచి రక్షణ కల్పించాలని చెప్పారు.