News February 11, 2025
వైసీపీ కార్యాలయానికి మరోసారి నోటీసులు

తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి పోలీసులు మరోసారి నోటీసులు అందజేశారు. ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన రోజు కార్యాలయానికి వచ్చిన సందర్శకులు, నేతల జాబితా ఇవ్వాలని పార్టీ కార్యాలయ వర్గాలను పోలీసులు కోరారు. అలాగే సీసీ కెమెరా డేటా, పార్కింగ్ లోని వాహనాల వివరాలతో మంగళవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి పీఎస్‌కు రావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.
Similar News
News March 16, 2025
GNT: మేయర్ ఆకస్మిక నిర్ణయంపై వైసీపీలో అసంతృప్తి

మేయర్ మనోహర్ రాజీనామా నిర్ణయంపై వైసీపీలో కూడా కొంత అసంతృప్తికి దారితీసినట్లు సమాచారం. వైసీపీకి ఉన్న 23 మంది కార్పొరేటర్లతో ఆయన మాట మాత్రం చెప్పకుండా నిర్ణయం తీసుకున్నారని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు వ్యాఖ్యానించారు. పార్టీ జిల్లా నగర అధ్యక్షులకు కూడా సమాచారం ఇవ్వలేదని సమాచారం. టీడీపీ అవిశ్వాసం పెట్టడానికి ముందే మేయర్ రాజీనామా చేయడంతో తదుపరి చర్యలపై ఆ పార్టీ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు.
News March 16, 2025
రేపటి నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం

ఇంటర్ ప్రథమ, 2వ సంవత్సరం విద్యార్థులకు ప్రధాన పరీక్షలు శనివారంతో ముగిశాయి. గురువారంతో ఇంటర్ ప్రథమ సంవత్సరం, శనివారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ముగిశాయి. చివరి రోజు పరీక్షలకు జనరల్, ఒకేషనల్ విద్యార్థులు కలిపి 29,405 మందికి 28,901 మంది హాజరు కాగా 503 మంది గైర్హాజరయ్యారు. జవాబు పత్రాల మూల్యాంకనం సోమవారం నుంచి జరగనుంది. ఇందుకోసం సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళ కాలేజీలో ఏర్పాట్లు చేశారు.
News March 16, 2025
GNT: అందుకే కావటి మనోహర్ రాజీనామా.?

నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలను టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని అన్ని స్థానాలను కైవసం చేసుకుంది. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం జీఎంసీలో 4ఏళ్లలోపు ఎటువంటి అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వీల్లేదు. ఈ నెలతో ఆ గడువు ముగుస్తుంది. కనుక అవిశ్వాస తీర్మానం కచ్చితంగా పెడతామని టీడీపీ నాయకులు బాహాటంగానే ప్రకటించారు. అందుకే మేయర్ రాజీనామా అని పలువురు చర్చించుకుంటున్నారు.