News August 16, 2024
వైసీపీ కౌన్సిలర్లకు టీడీపీలోకి నో ఎంట్రీ: ఎమ్మెల్యే కందుల
మార్కాపురంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కందుల నారాయణ అధ్యక్షతన పట్టణ బూత్ కన్వీనర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. అలాగే వైసీపీ కౌన్సిలర్లను టీడీపీలో చేర్పించుకోబోమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యే దిశగా వార్డుల్లో ప్రతి నాయకుడు పని చేయాలని ఎమ్మెల్యే సూచించారు. వార్డుల్లోని నాయకుడు సర్పంచ్‌తో సమానమని తెలిపారు.
Similar News
News September 19, 2024
ప్రకాశం జిల్లా యువకులకు గమనిక
ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ కోసం ఎందరో యువకులు ఎదురు చూస్తున్నారు. వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కడప నగరంలో నవంబర్ 10 నుంచి 15వ తేదీ వరకు ర్యాలీ నిర్వహిస్తారు. ఈ మేరకు కడప మున్సిపల్ స్టేడియంలో అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు. ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లా యువకులు సైతం ఇందులో పాల్గొనవచ్చు. మరి ర్యాలీకి మీరు సిద్ధమా..?
News September 19, 2024
బూచేపల్లికి వైసీపీ జిల్లా అధ్యక్ష పదవి.?
దర్శి MLA బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు ప్రకాశం జిల్లా వైసీపీ పెద్దగా వ్యవహరించిన బాలినేని అనూహ్యంగా రాజీనామా ప్రకటించారు. దీంతో జిల్లా బాధ్యతలు ఎవరు చేపడతారా? అనే చర్చ కొనసాగుతోంది. వైవీ సుబ్బారెడ్డి రాష్ట్రస్థాయిలో కీలకంగా ఉండటంతో బూచేపల్లికే అధ్యక్ష పదవి వస్తుందని భావిస్తున్నారు.
News September 18, 2024
ప్రకాశం: ‘సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి’
ఫేక్ ప్రొఫైల్ DPలతో అపరిచిత ఫోన్ నంబర్ల నుంచి వచ్చే నగదు అభ్యర్థనలకు స్పందించవద్దని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ బుధవారం తెలిపారు. సైబర్ నేరాల బారిన పడితే వెంటనే సైబర్ క్రైమ్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదుచేయాలని సూచించారు. స్నేహితుల ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ల DPలుగా పెట్టుకొని మోసాలకు పాల్పడతారని, అటువంటి వారిపై జాగ్రత్తగా ఉండాలన్నారు.