News November 15, 2024
వైసీపీ టాస్క్ ఫోర్స్ కమిటీలో నెల్లూరు జిల్లా నేతలకు చోటు
వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులకు అండగా నిలిచేందుకు పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా టాస్క్ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యులుగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నారు.
Similar News
News December 13, 2024
నెల్లూరు: రేపు పాఠశాలలకు సెలవు రద్దు
రేపు రెండో శనివారం అయినప్పటికీ ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు పనిచేస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్.బాలాజీ రావు తెలిపారు. అక్టోబర్ నెలలో వర్షాల వలన సెలవులు ఇచ్చినందున ఈ నిర్ణయం జిల్లా కలెక్టర్ అనుమతితో తీసుకోవడం జరిగిందన్నారు. సంవత్సరంలో 220 పని రోజులు కచ్చితంగా పాఠశాలలు పనిచేయవలసి ఉందని పేర్కొన్నారు.
News December 13, 2024
జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్ వర్షం కారణంగా వాయిదా
రేపు నెల్లూరులో జరగాల్సిన జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్ వర్షం కారణంగా వాయిదా వేసినట్లు జిల్లా పోలీస్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేశారు. వర్షం కారణంగా పాడైనా ట్రాక్ & ఫీల్డ్ ఈవెంట్స్ కోర్ట్ లు తిరిగి సిద్ధం చేస్తున్నామన్నారు. శనివారం జరగవలసిన ఈవెంట్స్ ఆదివారానికి వాయిదా వేసినట్లు వారు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా పోలీస్ సిబ్బంది, మీడియా గమనించగలరని కోరారు.
News December 13, 2024
చిల్లకూరు మండలంలో పొంగి పొర్లుతున్న వాగులు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నిన్న కురిసిన భారీ వర్షాలకు చిల్లకూరు మండలంలోని పలు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మండలంలోని నాంచారమ్మపేట నుంచి పారిచర్ల వారి పాలెం గ్రామం మధ్యలో ఉన్న వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. వాగు ప్రభావితం తగ్గేవరకు అటువైపు వెళ్లే వాహనదారులు, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలియజేస్తున్నారు.