News July 11, 2024

వైసీపీ నాయకులు ఆర్థిక నేరగాళ్లు: సీఎం చంద్రబాబు

image

వైసీపీ నాయకులపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల పాలనలో విశాఖ సహా ఉత్తరాంధ్రలో వనరులను, ప్రకృతిని దోచుకున్న ఆర్థిక నేరగాళ్లు.. వైసీపీ నాయకులని అన్నారు. గురువారం దార్లపూడిలో జరిగిన సభలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. ప్రజల సొమ్మును దోచుకున్న ఆర్థిక నేరగాళ్లను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం హెచ్చరించారు. వైసీపీ అంటే అబద్ధాల పార్టీ అని దుయ్యబట్టారు.

Similar News

News December 23, 2025

విశాఖలో రూ.27 కోట్ల జీఎస్టీ మోసం

image

విశాఖపట్నం డీజీజీఐ డిప్యూటీ డైరెక్టర్ శ్వేతా సురేష్ నేతృత్వంలో జరిగిన దర్యాప్తులో రూ.27.07 కోట్ల భారీ జీఎస్టీ మోసం వెలుగుచూసింది. ఎటువంటి వస్తు సరఫరా లేకుండా నకిలీ ఐటీసీని సృష్టించిన ఈ నెట్‌వర్క్ సూత్రధారి మల్లికార్జున మనోజ్ కుమార్‌ను అధికారులు అరెస్టు చేశారు. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యల్లో భాగంగా విశాఖ జోనల్ యూనిట్ ఈ ఏడాది చేసిన నాలుగో అరెస్టు ఇది అని అధికార వర్గాలు తెలిపాయి.

News December 23, 2025

విశాఖ: రెండో మ్యాచ్‌లోనూ పైచేయి సాధిస్తారా?

image

విశాఖపట్నం వేదికగా శ్రీలంక మహిళలతో శనివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఘనవిజయం సాధించింది. బౌలర్ల అద్భుత ప్రదర్శన, ఆపై బ్యాటర్ల నిలకడైన ఆటతీరుతో భారత్ 8 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసింది. ఈ విజయం ద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇవాళ రెండో మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మేరకు నిన్న నెట్స్‌లో టీం చెమటోడ్చారు.

News December 23, 2025

విశాఖ బీచ్ రోడ్‌లో పీసా రన్ ప్రారంభం

image

విశాఖలో మంగళవారం నుంచి పీసా మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం విశాఖ బీచ్ రోడ్‌లో గల కాళీమాత టెంపుల్ వద్ద PESA రన్ ప్రారంభించారు. క్రీడాకారిణి జ్యోతి సురేఖ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. IAS అధికారులు ముక్తా శేఖర్, శశిభూషణ్ కుమార్, కృష్ణ తేజ, ముత్యాల రాజు ఉన్నారు.