News January 28, 2025

వైసీపీ నిధుల దుర్వినియోగం: ఎంపీ శబరి

image

నంద్యాల జిల్లా కలెక్టరేట్‌లోని సెంటెనరీ హల్లో 20 సూత్రాల పథకం అమలుపై రాష్ట్ర ఛైర్మన్ లంకా దినకర్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సక్రమంగా నివేదికలు అందించి నిధులు దుర్వినియోగం కాకుండా నిజమైన భాదితులకు పథకాలు అందేలా చూడాలని కోరారు. గత వైసీపీ పాలనలో జల్ జీవన్ మిషన్ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

Similar News

News October 17, 2025

కోహ్లీ వరల్డ్ రికార్డు సృష్టిస్తాడా?

image

స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 7 నెలల తర్వాత ఈనెల 19న AUSతో తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడనున్నారు. ఈ సిరీస్‌లో తను వరల్డ్ రికార్డు నెలకొల్పే అవకాశముంది. 3 మ్యాచ్‌ల్లో ఒక్క సెంచరీ చేసినా 148 ఏళ్ల క్రికెట్ చరిత్రలో సింగిల్ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా నిలుస్తారు. సచిన్ టెస్టుల్లో 51 సెంచరీలు చేయగా విరాట్ వన్డేల్లో 51 శతకాలు బాదారు. మరో సెంచరీ చేస్తే సచిన్‌ రికార్డును అతడు అధిగమిస్తారు.

News October 17, 2025

రామగుండం: సింగరేణి ఉద్యోగులకు 20న సెలవు

image

సింగరేణి ఉద్యోగులకు ఈనెల 20న దీపావళి పండుగ సందర్భంగా వేతనంతో కూడిన సెలవు దినం ప్రకటించారు. ఈ మేరకు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అత్యవసర విధులు నిర్వహించే ఉద్యోగులకు సెలవు రోజున సాధారణ వేతనంతో పాటు మూడింతలు అధికంగా వేతనం చెల్లించనున్నట్లు అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News October 17, 2025

సిరిసిల్ల: అప్పుల బాధతో వృద్ధుడు ఆత్మహత్య

image

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మం. కేంద్రానికి చెందిన పిట్టల నరసయ్య పురుగులమందు తాగి గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం అతడిని కరీంనగర్‌కి తరలించగా అప్పటికే మృతి చెందాడు. అప్పుల బాధతో నరసయ్య తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.