News January 28, 2025
వైసీపీ నిధుల దుర్వినియోగం: ఎంపీ శబరి

నంద్యాల జిల్లా కలెక్టరేట్‌లోని సెంటెనరీ హల్లో 20 సూత్రాల పథకం అమలుపై రాష్ట్ర ఛైర్మన్ లంకా దినకర్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సక్రమంగా నివేదికలు అందించి నిధులు దుర్వినియోగం కాకుండా నిజమైన భాదితులకు పథకాలు అందేలా చూడాలని కోరారు. గత వైసీపీ పాలనలో జల్ జీవన్ మిషన్ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
Similar News
News February 6, 2025
బోయినిపల్లి: దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న సుడిగాలి సుధీర్

బోయినపల్లి మండలంలోని వరద వెళ్లి గ్రామంలో గుట్టపై వెలిసిన శ్రీ దత్తాత్రేయ స్వామిని జబర్దస్త్ నటులు సుడిగాలి సుధీర్, రాంప్రసాద్ దర్శించుకున్నారు. ఈరోజు దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. స్వామివారి కృప అందరిపై ఉండాలని కోరుకున్నారు. గుట్ట పైన ఎంతో ప్రకృతి అందాలతో బోటు ద్వారా వచ్చి దత్తాత్రేయుని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. నాగుల సాంబయ్య, భక్తులు ఉన్నారు.
News February 6, 2025
గోకవరం: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

కొత్తపల్లి నుంచి కామరాజుపేట వెళ్లే జంక్షన్ వద్ద గురువారం బైక్ అదుపుతప్పి రోడ్డుపై యువకుడు పడిపోయాడు. దీంతో అతడి తలకు బలంగా దెబ్బ తగిలినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే 108కు కాల్ చేసి గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 6, 2025
భీమారం: తాళం వేసిన ఇంట్లో చోరీ

భీమారంలోని ఐటీడీఏ కాలనీలో తాళం వేసిన ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. భీమారం ఎస్ఐ శ్వేత వివరాల ప్రకారం.. రాంటెంకి రంజిత్ కుమార్ జనవరి 31న తన కొడుకు అక్షరాభ్యాసం కోసం సిద్దిపేట మండలంలోని శనిగారం గ్రామానికి వెళ్లాడు. కాగా ఈనెల 5న ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి బీరువాలో రూ.50వేల నగదు, రూ.42వేల విలువ గల బంగారం చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.