News January 25, 2025
వైసీపీ నుంచి ఇద్దరు కళ్యాణదుర్గం నేతల సస్పెండ్

కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇద్దరు నేతలను వైసీపీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో కళ్యాణదుర్గం మున్సిపల్ వైస్ ఛైర్మన్ జయం ఫణీంద్ర, బ్రహ్మసముద్రం జడ్పీటీసీ ప్రభావతమ్మను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. ఇటీవల జరిగిన మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో ఎమ్మెల్యే సురేంద్రబాబుకు వైస్ ఛైర్మన్ జయం ఫణీంద్ర సన్మానం చేసినట్లు తెలుస్తోంది.
Similar News
News February 7, 2025
మాతృ భాషను బోధించాలి: అనంత కలెక్టర్

కేంద్రీయ విద్యాలయంలో మాతృ భాష తెలుగును కూడా బోధించాలని, విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా విద్యా బోధన చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. గురువారం గుత్తిలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొని సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది మార్గదర్శకాల ప్రకారం తరగతి సీట్లను పెంచి అడ్మిషన్స్ పూర్తి చేయాలన్నారు.
News February 6, 2025
మంత్రి పయ్యావులకు సీఎం ర్యాంక్

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో పనితీరు ఆధారంగా సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో అనంతపురం జిల్లా మంత్రి పయ్యావుల కేశవ్ 24వ ర్యాంక్ సాధించారు. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సూచించారు.
News February 6, 2025
పల్లకీ సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు శ్రావణి

బుక్కరాయసముద్రంలో కొండమీద వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం ఉత్సవాల్లో ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. గ్రామంలో వెంకటరమణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే బండారు శ్రావణి, టీడీపీ నాయకుడు శ్రీరామ్ రెడ్డి, ఈవో రమేశ్ ఆధ్వర్యంలో స్వామిని పల్లకీలో ఉంచి గ్రామంలో ఊరేగించారు. దేవరకొండపైకి తీసుకెళ్లారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.