News November 4, 2024
వైసీపీ నేతలు కళ్లకు గంతలు విప్పుకోవాలి: ప్రత్తిపాటి

వైసీపీ నేతలు వారి కళ్లకు కట్టుకున్న నీలి గంతలు విప్పుకుంటే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాలు కనిపిస్తాయని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు. నాదెండ్ల మండలం జంగాలపల్లి, తూబాడులో ఆదివారం పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. తూబాడులోని రూ.15 లక్షలతో సీసీ రహదారులు, డ్రైన్ల నిర్మాణానికి, జంగాలపల్లిలో సీసీ రహదారులకు భూమిపూజ చేశారు.
Similar News
News March 2, 2026
తుళ్లూరులో కొడుకుని పట్టించిన పేరెంట్స్..!

తుళ్లూరు మండల పరిధిలోని గ్రామాల్లో ఆవులను దొంగతనం చేస్తున్న వ్యక్తిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు శ్రీకాంత్ మండల వ్యాప్తంగా సుమారు 25 ఆవులకు పైగా అపహరించినట్లు పలువురు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతణ్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా, స్టేషన్ వెనకవైపు ఉన్న గోడ దూకి పారిపోయాడు. తిరిగి కుటుంబ సభ్యులు పోలీసులకు అప్పజెప్పగా సిబ్బంది పేరెంట్స్‌ను అభినందించారు.
News March 2, 2026
గుంటూరులో ప్రారంభమైన రెవెన్యూ క్లినిక్

గుంటూరు కలెక్టరేట్ శంకర్ సమావేశ మందిరంలో రెవెన్యూ క్లినిక్ సోమవారం ప్రారంభమైంది. జేసీ శ్రీవాత్సవ, ఆర్డీఓ శ్రీనివాసరావు డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ కుమారి అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. భూ సమస్యలు, వివాదాలకు సంబంధించిన అర్జీలు అందాయి. రెవెన్యూ క్లినిక్ వచ్చే సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని జేసీ అధికారులను ఆదేశించారు.
News March 2, 2026
రెవెన్యూ క్లీనిక్ కోసం కలెక్టరేట్‌లో 4 కౌంటర్లు ఏర్పాటు: కలెక్టర్

గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం జరగనున్న పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లీనిక్ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. https://Meekosam.ap.gov.in సైట్‌లో కూడా అర్జీలు సమర్పించవచ్చని తెలిపారు. టోల్ ఫ్రీ 1100 ద్వారా అర్జీల స్థితిని తెలుసుకోవచ్చని సూచించారు. రెవెన్యూ క్లీనిక్ కోసం కలెక్టరేట్‌లో 4 కౌంటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.


