News November 24, 2024

వైసీపీ నేత సజ్జల భార్గవ్‌కు నోటీసులు

image

కడప జిల్లా పులివెందులలో నమోదైన కేసుల నేపథ్యంలో వైసీపీ నేత సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిలకు పులివెందుల పోలీసులు 41-A కింద నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను విజయవాడలో భార్గవ్ తల్లికి అందజేయగా, అర్జున్ రెడ్డి ఇంటికి నోటీసులు అంటించారు. ఈ నెల 8న ఐటీ, అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎ-1గా వర్రా , ఎ-2 సజ్జల భార్గవ్, ఎ-3గా అర్జున్ రెడ్డిలను చేర్చారు.

Similar News

News October 20, 2025

కడప: నేడు పబ్లిక్ గ్రీవెన్స్ రద్దు

image

దీపావళి పండుగ సందర్భంగా ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ నచికేత్ తెలిపారు. దీపావళి పండుగ సందర్భంగా రద్దు చేస్తున్నామని అర్జీదారులు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చేప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన అన్నారు. జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

News October 19, 2025

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

image

దీపావళిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికి YS జగన్ ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటా దీపాలు వెలగాలని, ఆనందాలు వెల్లువలా పొంగాలని అన్నారు. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, దివ్వెల వెలుగులో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో విరాజిల్లాలని కోరుతున్నట్లు జగన్ పేర్కొన్నారు.

News October 19, 2025

కడప: రేపు పబ్లిక్ గ్రీవెన్స్ రద్దు

image

దీపావళి పండుగ సందర్భంగా ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ నచికేత్ తెలిపారు. అర్జీదారులు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చేప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన అన్నారు. జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.