News November 24, 2024
వైసీపీ నేత సజ్జల భార్గవ్‌కు నోటీసులు
కడప జిల్లా పులివెందులలో నమోదైన కేసుల నేపథ్యంలో వైసీపీ నేత సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిలకు పులివెందుల పోలీసులు 41-A కింద నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను విజయవాడలో భార్గవ్ తల్లికి అందజేయగా, అర్జున్ రెడ్డి ఇంటికి నోటీసులు అంటించారు. ఈ నెల 8న ఐటీ, అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎ-1గా వర్రా , ఎ-2 సజ్జల భార్గవ్, ఎ-3గా అర్జున్ రెడ్డిలను చేర్చారు.
Similar News
News December 10, 2024
కుందూ నదిలో పడి యువకుడు మృతి
కడప జిల్లా చాపాడు మండల కేంద్రమైన అదే గ్రామానికి చెందిన పూజారి సురేశం(32) అనే యువకుడు కుందూ నదిలో పడి మృతి చెందాడు. 10 రోజుల క్రితం దుబాయ్ నుంచి చాపాడుకు వచ్చిన సురేశ్ సోమవారం మధ్యాహ్నం కుందూ నది వద్దకు వెళ్లాడు. ఏం జరిగిందో తెలీదు గానీ సురేశ్ నదిలో కొట్టుకుపోవటాన్ని గమనించిన స్థానికులు కుటుంబానికి తెలిపారు. గాలింపు చేపట్టగా మంగళవారం ఉదయం మృతదేహం బయటపడింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 10, 2024
బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే కఠినంగా వ్యవహరిస్తాం: ఎస్పీ
పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో బియ్యం అక్రమ రవాణా జరగకుండా, రాయచోటి, మదనపల్లి, రాజంపేట, సబ్ డివిజన్ ప్రాంతాలలో రైస్ మిల్లులు, గోడౌన్లపై, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ, పోలీసులకు స్పెషల్ టీంల సహకారంతో సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
News December 10, 2024
14, 15వ తేదీలలో వైవీయూ రెండో దశ అంతర కళాశాలల క్రీడా పోటీలు
వైవీయూ అంతర్ కళాశాలల పురుషులు మహిళల క్రీడా పోటీలు ప్రొద్దుటూరు డా.వైఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈనెల 14, 15 తేదిల్లో నిర్వహించనున్నట్లు క్రీడా బోర్డు కార్యదర్శి డా.కె. రామసుబ్బారెడ్డి తెలిపారు. పురుషులు మహిళలకువాలీబాల్, కబడ్డీ, టగ్ ఆఫ్ వార్ పోటీలు ఉంటాయన్నారు. ఈ క్రీడల్లో పాల్గొనేవారు ఈ ఏడాది జులై 1వ తేదీ నాటికి 17 – 25 సంవత్సరాల మధ్య ఉండాలన్నారు. వైవీయూ అనుబంధ కళాశాలలో చదువుతూ ఉండాలని తెలిపారు.