News April 13, 2025

వైసీపీ పీఎస్సీ సభ్యులుగా మాజీ మంత్రులు 

image

వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన మాజీ మంత్రులు కొడాలి నాని, జోగి రమేశ్, వెల్లంపల్లి శ్రీనివాసరావుని నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నేడు జాబితా విడుదల చేశారు. పొలిటికల్ అడ్వైజరీ కమిటీ కన్వీనర్‌గా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తారని పార్టీ విడుదల చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు. 

Similar News

News April 10, 2026

పోషణ్ పక్వాడ్ పోస్టర్లు ఆవిష్కరించిన కలెక్టర్

image

అన్నమయ్య జిల్లాలో 8వ పోషణ పక్వాడ కార్యక్రమాలతో ఈనెల 23 వరకు అంగన్వాడీ కేంద్రాలు, పంచాయితీలు, గ్రామ స్థాయిలో పౌష్టికాహారం లోపంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులు ఆదేశించారు. శుక్రవారం మదనపల్లి కలెక్టరేట్‌లో ఐసీడీఎస్‌తో కలసి పోషణ పక్వాడ ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు, గర్భిణీలు బాలింతల్లో పోషకాహారంపై అవగాహన పెంచాలన్నారు.

News April 10, 2026

గులాబీ గూటికి జీవన్ రెడ్డి.. కండువా కప్పనున్న KCR

image

TG: సీనియర్ నేత జీవన్ రెడ్డి BRSలో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20న జగిత్యాలలో BRS భారీ బహిరంగ సభలో కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఇప్పటికే జీవన్ రెడ్డి ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే పార్టీలో చేరిక తేదీని కన్ఫర్మ్ చేశారు. ఇక తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానం పట్టు కోల్పోయిందని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

News April 10, 2026

సూర్యాపేట: పంట మార్పిడిలో జిల్లా వెనుకంజ

image

జిల్లాలో పంటల వైవిధ్యం లోపించడంపై వ్యవసాయ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. జిల్లాలోని 6.24 లక్షల ఎకరాల సాగు భూమిలో 92.5% కేవలం వరి, పత్తి పంటలే సాగవుతుండటంతో రాష్ట్రంలోనే జిల్లా చిట్టచివరి స్థానంలో నిలిచింది. ఒకే రకమైన పంటల వల్ల భూసారం తగ్గి, పెట్టుబడి పెరుగుతోందని అధికారులు హెచ్చరిస్తున్నారు. భూమి ఆరోగ్యాన్ని కాపాడేందుకు రైతులు పంట మార్పిడి చేపట్టి, ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని సూచిస్తున్నారు.