News August 14, 2024
వైసీపీ పూర్వవైభవానికి బొత్స విజయం బీజం: అంబటి
విశాఖ స్థానిక సంస్థల MLC ఉప ఎన్నికలలో బొత్సను వైసీపీ అధిష్ఠానం బరిలో దింపింది. అయితే కూటమి నుంచి ఎవరూ పోటీలోలేరని సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బొత్స విజయం ఖాయం కానుంది. దీనిపై స్పందిస్తూ మాజీ మంత్రి అంబటి ” YSRCP పూర్వ వైభవానికి బీజం వేసిన బొత్స విజయం ” అంటూ తన X లో పేర్కొన్నారు. ఇది నిరుత్సాహంలో ఉన్న వైసీపీకి ఊరటనిచ్చే విషయమేనని పలువురు చర్చించుకుంటున్నారు.
Similar News
News September 11, 2024
కౌలు రైతుల రుణాలను ముమ్మరం చేయాలి: కలెక్టర్
విజయనగరం జిల్లాలో కౌలు రైతులకు రుణాలు అందించే కార్యక్రమాన్ని బ్యాంకులు మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ అంబేడ్కర్ బ్యాంకర్లను కోరారు. కౌలు రైతులకు రుణాలు అందించే కార్యక్రమంపై డీసీసీ సమావేశంలో కలెక్టర్ సమీక్షించారు. 2,333 మందికి కౌలు రుణాల కోసం బ్యాంకులకు దరఖాస్తులు పంపించామని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి రామారావు వివరించారు.
News September 10, 2024
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
విజయనగరం పట్టణం అలకానంద కాలనీలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు చేశారు. అక్కడ కొన్నాళ్లుగా ఒక మహిళ వ్యభిచార గృహం నిర్వహిస్తుందనే సమాచారంతో మంగళవారం సాయంత్రం దాడులు చేసి, ఇద్దరు విటులు, ఒక బాధితురాలితో పాటు వ్యభిచార గృహం నిర్వహిస్తున్న మహిళను వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యభిచార గృహం నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.
News September 10, 2024
ఐటీఐ అభ్యర్థులకు దుబాయ్‌లో ఉద్యోగావకాశాలు
విశాఖ కంచరపాలెం ప్రభుత్వ ITIలో ఈ నెల 12న ఉదయం 9 గంటల నుంచి అశోక్ లేలాండ్ కంపెనీ వారిచే జాబ్ ఫేర్ నిర్వహిస్తున్నట్లు విజయనగరం ప్రభుత్వ ITI ప్రిన్సిపల్ టి.వి.గిరి మంగళవారం తెలిపారు. ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, మోటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్, ఆటో పెయింటర్ ట్రేడ్లలో ITI పాసైన వారు అర్హులు. దుబాయ్‌లో ఉద్యోగావకాశం ఉంటుందన్నారు. వివరాలకు 9440197068, 9849118075 నంబర్‌లను సంప్రదించాలన్నారు.