News September 26, 2024

వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా సురేశ్

image

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పలు జిల్లాలకు పూర్తి అధ్యక్షులు, పార్టీ కన్వీనర్లను గురువారం ప్రకటించారు. మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సురేశ్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (PAC) సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News October 25, 2025

కొండపి: స్కూల్ బస్సుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం

image

కొండపిలో ఓ ప్రైవేటు స్కూల్ బస్సుకు శనివారం పెను ప్రమాదం తప్పింది. కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కొండపి నుంచి అనకర్లపూడి వెళ్లే బస్సు పక్కకు ఒరిగింది. ఆ సమయంలో బస్సులో 40 మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. డ్రైవర్ చాకచక్యంతో విద్యార్థులను సురక్షితంగా బస్సు నుంచి కిందకు దించటంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు.

News October 25, 2025

కర్నూలు ఎఫెక్ట్.. ప్రకాశం ట్రావెల్స్ బస్సులకు హడల్..!

image

కర్నూల్‌లో ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని నేషనల్ హైవేలలో రాకపోకలు సాగిస్తున్న ట్రావెల్స్ బస్సుల రికార్డులను పరిశీలించారు. ఈ తనిఖీలు జిల్లా వ్యాప్తంగా సాగాయి.

News October 25, 2025

ప్రకాశంను వదలని వాన.. నేడు కూడా దంచుడే.!

image

ప్రకాశంను వర్షం వదిలేలాలేదని వాతావరణ శాఖ తెలిపింది. సూర్యుడు ఉదయించని రోజులను జిల్లా ప్రజలు వరుసగా 3 రోజులుగా చవిచూస్తున్నారు. తాజాగా ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు ప్రకటించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం నేటి నుంచి ఆగ్నేయ, దాని ప్రక్కనే ఉన్న మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందన్నారు. సోమవారంకు ఇది తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది.