News December 25, 2024
వైసీపీ పోరుబాట పోస్టర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి

చిలకలూరిపేట: వైయస్సార్సీపి ఆధ్వర్యంలోఈ నెల 27 నిర్వహించబోయే పోరుబాట పోస్టర్ను మాజీ మంత్రి విడుదల రజిని బుధవారం ఆవిష్కరించారు. మాజీ మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచిందన్నారు. యూనిట్కి రూపాయన్నర పెంచారన్నారు. రూ.15,485 కోట్లు భారం మోపడం దారుణమన్నారు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని మాజీ మంత్రి విమర్శించారు.
Similar News
News October 23, 2025
భారీ వర్షాలు.. గుంటూరు జిల్లాలో స్కూళ్లకు హాలిడే

గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గురువారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ డీఈవో సీవీ రేణుక ఆదేశాలు జారీ చేశారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉండటంతో పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు అయోమయంలో పడ్డారు. వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
News October 23, 2025
నేడు భగినీ హస్త భోజనం.. విశిష్టత తెలుసా?

భగినీ హస్త భోజనం.. సోదరీ సోదరుల ఆప్యాయతానురాగాలకు అద్దం పట్టే సాంప్రదాయ వేడుక ఇది. దీపావళి రెండో రోజు కార్తీక మాసంలో జరుపుకునే ఎంతో విశేషమైన ఈ పండుగ నాడు అక్కాచెల్లెళ్లు సోదరులను ఇంటికి పిలిచి నుదుట బొట్టు పెట్టి హారతి ఇచ్చి భోజనం తినిపించి శుభాకాంక్షలు తెలుపుతారు. తమ సోదరులు ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తారు. ఈ రోజును పుష్ప ద్వితీయ, యమ ద్వితీయ, కాంతి ద్వితీయ వంటి అనేక పేర్లతో పిలుస్తారు.
News October 23, 2025
పీజీఆర్ఎస్ అర్జీల పట్ల మనసు పెట్టండి: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తీసుకున్న అర్జీల పట్ల స్పష్టమైన విచారణ చేపట్టాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సూచించారు. బుధవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్లో వచ్చే ప్రతి సమస్యను హృదయ పూర్వకంగా అవగాహన చేసుకుని, వారి స్థానంలో ఆలోచించి వాస్తవ పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. నిర్దేశిత సమయంలో సమస్యలు పరిష్కారం కావాలన్నారు.