News August 23, 2024

వైసీపీ ప్రధాన కార్యదర్శిగా చెవిరెడ్డి

image

చంద్రగిరి మాజీ MLA చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కీలక పదవి లభించింది. జగన్ సూచనల మేరకు ఆయనను వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. గతంలోనూ ఆయన వైసీపీలో కీలకంగా వ్యవహరించారు. పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షుడిగానూ పని చేశారు. గత ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే.

Similar News

News October 22, 2025

చిత్తూరు జిల్లాలో వర్షపాతం వివరాలు ఇలా..!

image

చిత్తూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో 28 మండలాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా విజయపురంలో 20.2 మిమీ, అత్యల్పంగా యాదమరిలో 1.8 మిమీ వర్షపాతం నమోదైంది. గుడిపాలలో 14.2, ఐరాలలో 13.2, పూతలపట్టులో 9.4, పెద్దపంజాణిలో 9.2, పాలసముద్రంలో 8.6, పులిచెర్లలో 7.6, గంగాధరనెల్లూరులో 8.2, పలమనేరు, సోమల మండలాల్లో 6.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.

News October 22, 2025

చిత్తూరు CDCMS పర్సన్ ఇన్‌ఛార్జ్ జేసీ

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(CDCMS)కి అఫిషియల్ పర్సన్ ఇన్‌ఛార్జ్‌గా జాయింట్ కలెక్టర్ విద్యాధరిని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబరు 26వ తేదీ వరకు లేదా తిరిగి ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఆమె ఆ పదవిలో కొనసాగుతారు. గతంలో నియమించిన సుబ్రహ్మణ్యం నాయుడు మృతిచెందిన సంగతి తెలిసిందే.

News October 22, 2025

చిత్తూరు జిల్లాకు ఆరంజ్ అలర్ట్

image

చిత్తూరు జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. జిల్లా అంతట మంగళవారం రాత్రి విస్తారంగా వర్షాలు కురిశాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పంటలు నీట మునిగి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప, నెల్లూరు జిల్లాలకు సైతం ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.