News August 23, 2024

వైసీపీ ప్రధాన కార్యదర్శిగా చెవిరెడ్డి

image

చంద్రగిరి మాజీ MLA చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కీలక పదవి లభించింది. జగన్ సూచనల మేరకు ఆయనను వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. గతంలోనూ ఆయన వైసీపీలో కీలకంగా వ్యవహరించారు. పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షుడిగానూ పని చేశారు. గత ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే.

Similar News

News September 18, 2024

కుప్పంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి

image

కుప్పం చెరువు కట్టపై బుధవారం ట్రాక్టర్‌ను వెనుక నుంచి బైక్ ఢీ కొట్టిన ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందగా మరో విద్యార్థి గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ముగ్గురు విద్యార్థులు పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్నారని సమాచారం. మృతి చెందిన విద్యార్థులు ‌మదనపల్లె, తిరుపతికి చెందిన వారుగా పోలీసులు ‌గుర్తించారు. అర్బన్ సీఐ జీటీ నాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News September 18, 2024

తిరుపతి: ఈ నెల 20న ఉద్యోగ మేళా

image

తిరుపతి నగరం పద్మావతి పురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో 20వ తేదీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు. 5 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలియజేశారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లమా, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థుల అర్హులన్నారు. మొత్తం 190 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News September 18, 2024

తిరుపతి : రేపు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు

image

జాతీయ సంస్కృత యూనివర్సిటీ (NSU)లో కాంట్రాక్టు పద్ధతిలో వివిధ ఉద్యోగాలకు గురువారం ఉదయం 11 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. కోఆర్డినేటర్స్-4, టీచర్స్-16 మొత్తం 20 ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు. అర్హత, ఇతర వివరాలకు https://nsktu.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు.