News February 4, 2025
వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం: బాలకృష్ణ

వైసీపీ హయాంలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని, అభివృద్ధి అంటే ఏమిటో కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తుందని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. ఇప్పటికే హిందూపురం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలను సిద్ధం చేయడం జరిగిందన్నారు. వార్డులను అభివృద్ధి చేసుకోవాలని సంకల్పించి స్వచ్ఛందంగా వైసీపీకి రాజీనామా చేసి కౌన్సిలర్లు టీడీపీలో చేరారని అన్నారు.
Similar News
News November 20, 2025
ఎన్టీఆర్ వైద్యసేవలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: కలెక్టర్

డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ అమలులో నిర్లక్ష్యం వహించినా, చిన్న ఫిర్యాదు వచ్చినా సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టరు కె. వెట్రిసెల్వి హెచ్చరించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన వైద్య సేవలు – జిల్లా క్రమశిక్షణా కమిటీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులతో కలసి కలెక్టర్ పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.
News November 20, 2025
NRPT: గ్రంథాలయాలు విజ్ఞాన బండగారాలు

గ్రంథాలయాలు విజ్ఞాన బాండాగారాలు అని, పుస్తకపఠనం ద్వారా జ్ఞానం పెరుగుతుందని జిల్లా గ్రంథాలయాల సంస్థ ఛైర్మన్ విజయ్ కుమార్, మాజీ డీసీసీ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి అన్నారు. 58వ గ్రంథాలయాల వారోత్సవాలను పురస్కరించుకొని నారాయణపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాల పోటీల విజేతలకు బహుమతులు అందించారు. గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. నేతలు పాల్గొన్నారు.
News November 20, 2025
పంచాయతీ ఎన్నికలపై కీలక సమీక్ష

TG: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. CS రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇతర అధికారులతో సమీక్షించారు. స్థానిక ఎన్నికలను సమర్థంగా నిర్వహించాలని ఆమె ఆదేశించారు. కాగా మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 11, 14, 17న ఎలక్షన్స్ జరుగుతాయని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


