News February 4, 2025
వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం: బాలకృష్ణ

వైసీపీ హయాంలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని, అభివృద్ధి అంటే ఏమిటో కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తుందని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. ఇప్పటికే హిందూపురం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలను సిద్ధం చేయడం జరిగిందన్నారు. వార్డులను అభివృద్ధి చేసుకోవాలని సంకల్పించి స్వచ్ఛందంగా వైసీపీకి రాజీనామా చేసి కౌన్సిలర్లు టీడీపీలో చేరారని అన్నారు.
Similar News
News February 14, 2025
TGSRTCకి రూ.21.72 కోట్ల టోకరా.. ‘గో రూరల్’ ఆస్తులు సీజ్

TGSRTC బస్సులపై ప్రకటనల పేరుతో గో రూరల్ ఇండియా రూ.21.72 కోట్ల మోసానికి పాల్పడింది. యాడ్స్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆర్టీసీకి ఇవ్వకుండా తమ అనుబంధ కంపెనీలకు మళ్లించుకుని వ్యాపారం చేసినట్లు ఈడీ గుర్తించింది. దీంతో ఆ సంస్థకు చెందిన రూ.6.47 కోట్ల విలువైన స్థిరాస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది.
News February 14, 2025
మున్షీ స్థానంలో మీనాక్షి

TG: ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈమె రాహుల్ గాంధీ టీమ్‌లో కీలకంగా ఉన్నారు. కొంతకాలంగా మున్షీ తీరుపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం.
News February 14, 2025
పీఎంశ్రీ నిధుల వినియోగంపై సమీక్ష

జనగామ జిల్లా కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీఎం శ్రీ సమగ్ర శిక్ష పథకాల అమలు తీరుపై హైదరాబాద్ నుంచి పాఠశాల విద్యా డైరెక్టర్ నర్సింహారెడ్డితో కలిసి రాష్ట్ర విద్యా శాఖ సెక్రెటరీ యోగిత రాణా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో పీఎంశ్రీ కింద ఎంపిక చేయబడిన 15 పాఠశాలల్లో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం విడుదల చేయబడిన నిధులు, వాటి వినియోగంపై పలు సూచనలు చేశారు.