News February 10, 2025
వైసీపీ ముఖ్య నేతలతో గుడివాడ సమావేశం

విశాఖ వైసీపీ ఆఫీసులో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో సోమవారం ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా విశాఖ జిల్లాలో ఇటీవల నియమించిన అనుబంధ సంఘాల అధ్యక్షులతో పలు విషయాలపై చర్చించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె రాజు, రమణికుమారి ఉన్నారు.
Similar News
News March 28, 2025
ఇంట్లో పేకాట.. విశాఖలో 11 మంది అరెస్ట్

హెచ్‌బి కాలనీలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న వారిని ఎంవీపీ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.22,450 నగదు స్వాధీనం చేసుకున్నారు. 11 మందిపై కేసు నమోదు చేశారు. నగరంలో ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
News March 28, 2025
విశాఖలో నేడు బార్ అసోసియేషన్ ఎన్నికలు

విశాఖపట్నం బార్ అసోసియేషన్ ఎన్నికలు నేడు జరగనున్నాయి. కీలకమైన అధ్యక్ష పదవికి ఎం.కె. శ్రీనివాస్, అహమ్మద్, సన్నీ యాదవ్ తలపడుతుండగా.. ఉపాధ్యక్ష పదవికి చింతపల్లి ఆనంద్ కుమార్, కె.విజయ్ బాబు బరిలో ఉన్నారు. జనరల్ సెక్రటరీ పదవికి రాపేటి సూర్యనారాయణ, పార్వతి నాయుడు, సుధాకర్ తదితరులు పోటీలో ఉండగా.. కోశాధికారి పదవికి నరేశ్, రాము, శివప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఫలితాలు ఈరోజు రాత్రికి వెలువడే అవకాశం ఉంది.
News March 28, 2025
విశాఖలో ఈనెల 30న ట్రాఫిక్ ఆంక్షలు: సీపీ

విశాఖలో మార్చి 30న జరిగే IPL మ్యాచ్‌ల నిర్వహణపై సీపీ శంఖబ్రత బాగ్చీ గురువారం సమీక్షించారు. మ్యాచ్ జరిగే రోజు విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ తెలిపారు. మ్యాచ్ రోజు శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి వచ్చే భారీ వాహనాలు ఆనందపురం, పెందుర్తి, NAD మీదుగా నగరంలోకి రావాలన్నారు. చిన్న వాహనాలు మారికవలస, మిథులాపురి కాలనీ, బీచ్ రోడ్డు, జోడిగుడ్లపాలెం మీదుగా నగరంలోకి వెళ్లాలని సూచించారు.