News October 10, 2024
వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా గాదె మధుసూదన్

వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా బాపట్లకు చెందిన మాజీ మంత్రి తనయుడు గాదె మధుసూదన్‌రెడ్డిని నియమిస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. తన తండ్రి మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన మధుసూదన్ రెడ్డి బాపట్ల జిల్లాలో వైసీపీకి కీలక నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం నూతన కమిటీలలో రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 24, 2026
ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ తమీమ్ అన్సారియా

గుంటూరు కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్‌ను నెలవారీ తనిఖీల్లో భాగంగా గుంటూరు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మంగళవారం తనిఖీ చేశారు. గోడౌన్‌కు వేసిన తాళాల సీల్, సీసీ కెమెరాల డిస్‌ప్లే, ప్రాంగణాన్ని తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. గోడౌన్ భద్రత విషయంలో రాజీ లేకుండా అవసరమైన అన్ని చర్యలు నిరంతరం పటిష్ఠంగా చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
News February 24, 2026
ప్రైవేటుకు దీటుగా జూనియర్ కాలేజీలు: లోకేశ్

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తామని మంత్రి లోకేశ్ శాసనమండలిలో తెలిపారు. వీటిని ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దుతామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యాశాఖను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఇంటర్‌లో మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు ఇస్తోందన్నారు. త్వరలో ల్యాబ్‌లు ఏర్పాటు చేసి, పోటీ పరీక్షల మెటీరియల్ కూడా అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.
News February 24, 2026
గుంటూరు: పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పరీక్ష కేంద్రాలను కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తనిఖీ చేశారు. మంగళవారం గుంటూరు ప్రభుత్వ మహిళ జూనియర్ కళాశాలలో విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును గమనించారు. పరీక్షా కేంద్రంలో కనీస అవసరాలైన తాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షల సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకొనుటకు బస్ సౌకర్యం అంశాలను అడిగారు.


