News February 14, 2025
వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా చిట్లూరు రమేశ్ గౌడ్

వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా అనంతపురానికి చెందిన చిట్లూరు రమేశ్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రమేశ్ గౌడ్ మాట్లాడుతూ.. వైసీపీలో తనకు రాష్ట్రస్థాయి పదవిని కల్పించిన పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.
Similar News
News September 16, 2025
సంగారెడ్డి: ‘ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహించాలి’

ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా రేపు జిల్లాలోని అన్ని రకాల పాఠశాలలో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. పాఠశాలలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం జాతీయ పతకాన్ని ఆవిష్కరించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు.
News September 16, 2025
మహానగరంలో ఇవీ మా సమస్యలు

గ్రేటర్ వ్యాప్తంగా నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తమ సమస్యలు పరిష్కరించాలని 219 మంది వినతిపత్రాలు అందజేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 68 వివిధ సమస్యలపై ఫిర్యాదుచేశారు. అలాగే గ్రేటర్ పరిధిలోఉన్న ఆరు జోన్లలో 151 ఫిర్యాదులు వచ్చాయి. కూకట్‌పల్లిజోన్‌లో 55, సికింద్రాబాద్ 33, శేరిలింగంపల్లి 30, ఎల్బీనగర్ 15, చార్మినార్ 11, ఖైరతాబాద్ 7 ఫిర్యాదులు వచ్చాయని GHMC అధికారులు తెలిపారు.
News September 16, 2025
అది శనీశ్వరుడి విగ్రహం: భానుప్రకాశ్ రెడ్డి

అలిపిరిలో అపచారమని భూమన చేసిన <<17725838>>ఆరోపణలపై <<>>TTD బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి స్పందించారు. ‘అలిపిరి వద్ద గతంలో కన్నయ్య అనే వ్యక్తి ఓ ప్రైవేట్ శిల్పశాల నిర్వహించాడు. ఓ భక్తుడు శనీశ్వరుడి విగ్రహం ఆర్డర్ ఇవ్వగా.. తయారీలో లోపంతో 10 ఏళ్ల నుంచి అక్కడ ఉంచారు. ప్రక్కా ప్లాన్‌తో ఆ విగ్రహం చుట్టూ నిన్న రాత్రి మద్యం సీసాలు పడేశారు. అది మహావిష్ణువు విగ్రహమని భూమన దుష్ప్రచారం చేస్తున్నారని’ అని ఆయన చెప్పారు.