News February 14, 2025
వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా చిట్లూరు రమేశ్ గౌడ్

వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా అనంతపురానికి చెందిన చిట్లూరు రమేశ్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రమేశ్ గౌడ్ మాట్లాడుతూ.. వైసీపీలో తనకు రాష్ట్రస్థాయి పదవిని కల్పించిన పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.
Similar News
News March 20, 2025
పాఠశాలను తనిఖీ చేసిన MHBD అదనపు కలెక్టర్

కేసముద్రం, ఇనుగుర్తి మండలాల్లో పదవ తరగతి పరీక్షల నిర్వహణకు ఎంపికైన పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ పరిశీలించారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు, తాగునీరు, విద్యుత్ సరఫరా ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష జరిగే సమయాల్లో పరిసర ప్రాంతాలలో జిరాక్స్ సెంటర్లు మూసివేసి 144 సెక్షన్ విధించడం జరుగుతుందన్నారు.
News March 20, 2025
MTM: ‘ఉద్యోగులు కర్మ యోగి భారత్ ఆన్ లైన్ శిక్షణ పూర్తి చేయాలి’

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ఉద్యోగులందరూ ఈ నెల 26వ తేదీలోగా కర్మయోగి భారత్ ఆన్ లైన్ శిక్షణ పూర్తి చేసుకుని ధృవీకరణ పత్రం తప్పనిసరిగా పొందాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా అధికారులతో ఐ గాట్ కర్మయోగి భారత్ శిక్షణ కార్యక్రమంపై వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
News March 20, 2025
కామారెడ్డి జిల్లాకు ఎల్లో అలర్ట్

రానున్న నాలుగు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎండవేడితో అల్లాడుతున్న ప్రజలకు ఇది కాస్త ఉపశమనం అయినప్పటికీ.. పంటలకు నష్టం జరిగే అవకాశం ఉందని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.