News February 22, 2025
వైసీపీ హయాంలో ఉపాధి నిధులు దుర్వినియోగం: దినకర్

వైసీపీ పాలనలో ఉపాధి హామీ నిధుల అస్తవ్యస్త వినియోగం జరిగిందని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు ఛైర్మన్ లంకా దినకర్ అన్నారు. శనివారం ఆయన విశాఖ బీజేపీ కార్యాలయంలో మాట్లాడారు. 15జిల్లాలో పర్యటించి జిల్లాల అధికారులతో వివిధ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించామన్నారు. జగన్ పాలనలో ఉపాధిహామీ నిధుల దుర్వినియోగం జరిగిందన్నారు. గత ఐదేళ్ల అస్తవ్యస్థ విధ్వంస పాలన నుంచి ఇప్పుడిప్పుడే బయటపడే ప్రయత్నం జరుగుతుందన్నారు.
Similar News
News November 9, 2025
‘ప్రజా ఉద్యమం’ పోస్టర్ ఆవిష్కరించిన కురసాల కన్నబాబు

విశాఖ వైసీపీ కార్యాలయంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు కె.కె.రాజు ఆధ్వర్యంలో ఆదివారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేతులు మీదుగా “ప్రజా ఉద్యమం” పోస్టర్ ఆవిష్కరించారు. మెడికల్ కాలేజీల ప్రవేటికరణకు వ్యతిరేకంగా నవంబర్-12 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
News November 9, 2025
6,000 మందితో గీతా పారాయణం

విశాఖపట్నంలోని పోర్ట్ ఇన్డోర్ స్టేడియంలో ఆదివారం భగవద్గీత పారాయణం నిర్వహించారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో 6,000 మందికి పైగా భక్తులు ఏకస్వరంతో 700 శ్లోకాల భగవద్గీత పారాయణం చేశారు. 3 గంటలకు పైగా సాగిన ఈ మహా పారాయణంలో గీతా శ్లోకాలు ప్రతిధ్వనిస్తూ ఈ కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమాన్ని ఓ ఫౌండేషన్-అవధూత దత్త పీఠం నేతృత్వంలో నిర్వహించారు.
News November 9, 2025
ఏపీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారుతుంది: మంత్రి కొండపల్లి

విశాఖలో ఏపీ గ్లోబల్ ఎంఎస్ఎంఈ ఎగుమతుల అభివృద్ధి సదస్సును ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు. ఈ సదస్సుకు 16 దేశాల నుంచి 44 మంది డెలిగేట్లు హాజరయ్యారు. ఏపీని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి పేర్కొన్నారు. MSMEలకు ఇప్పటికే రూ.439 కోట్ల మేర ప్రోత్సాహకాలను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.


