News September 13, 2024

వైసీపీ PAC మెంబర్‌గా పెద్దిరెడ్డి

image

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. పెద్దిరెడ్డిని పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ మెంబర్‌గా నియమించారు. తిరుపతి జిల్లా(తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు) అధ్యక్షుడిగాను అవకాశం కల్పించారు. మరోవైపు మాజీ మంత్రి రోజా, తిరుపతి మాజీ MLA భూమన కరుణాకర్ రెడ్డిని రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నియమించారు. ఈ మేరకు వైసీపీ సెంట్రల్ ఆఫీసు నుంచి ఉత్తర్వులు వచ్చాయి.

Similar News

News October 7, 2024

తిరుపతిలో 10న జాబ్ మేళా

image

APSSDC ఆధ్వర్యంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC)లో 10వ తేదీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్యాభివృధి శాఖ అధికారి లోకనాదం పేర్కొన్నారు. 3 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలియజేశారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లమాతోపాటూ ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News October 7, 2024

చిత్తూరు: 405 పంచాయతీ సెక్రటరీల బదిలీల

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం భారీగా సాధారణ బదిలీలు జరిగాయి. ఇందులో భాగంగా పంచాయతీరాజ్ శాఖలోని DPO పరిధిలో 405 మంది పంచాయతీ సెక్రటరీలను బదిలీ చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-1 నుంచి గ్రేడ్-4 వరకు 202 మంది, గ్రేడ్-5 కింద 152 మంది, ఈవోపీఆర్డీలు ఏడుగురు, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-6(డిజిటల్ అసిస్టెంట్) 44 మంది బదిలీ అయ్యారు.

News October 7, 2024

శ్రీ‌వారి గ‌రుడ‌సేవ‌కు విస్తృతమైన ఏర్పాట్లు : టీటీడీ ఈవో

image

తిరుమ‌ల శ్రీ‌వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 8వ‌ తేదీ సాయంత్రం శ్రీ మలయప్ప స్వామి విశేష‌మైన గరుడ వాహనంపై సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విహరిస్తారని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఆదివారం సాయంత్రం ఎస్పీ శ్రీ సుబ్బరాయుడుతో కలిసి ఈవో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.