News March 20, 2025
వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించిన డా.పివి నందకుమార్ రెడ్డి

కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ నూతన వైస్ ఛాన్సలర్‌గా డా.పివి నందకుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యూనివర్సిటీ ప్రతిష్టను పెంపొందించేందుకు అందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. యూనివర్సిటీలోని పలు విభాగాలను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో ముచ్చటించారు. వీసీకి రిజిస్టర్ సంధ్య, ఎగ్జామినేషన్ కంట్రోలర్ రమేశ్, ప్రవీణ్ కుమార్ తదితరులు అభినందనలు తెలిపారు.
Similar News
News March 20, 2025
వరంగల్: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి జరిమానా

వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారిని కోర్టులో హాజరు పరిచారు. 21 మందిని వరంగల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ అబ్బోజు వెంకటేశం ముందు హాజరు పరచగా.. వారికి రూ.20,600 జరిమానా విధించారు. అలాగే లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన మరో నలుగురికి రెండు వేల జరిమానా విధించినట్లు సీఐ రామకృష్ణ తెలిపారు.
News March 20, 2025
మహిళ సాధికారతకు ప్రభుత్వ కృషి: మంత్రి

మహిళ సాధికారతకు ప్రభుత్వ కృషి చేస్తుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని దేశాయిపేట దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌ను ప్రారంభించారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక పురోగతికి అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తీసుకురావడం జరిగిందన్నారు.
News March 20, 2025
భద్రకాళి చెరువు పూడికతీత పనులు పూర్తి కావాలి: మంత్రి

వానకాలం సీజన్ రాకముందు భద్రకాళి చెరువు పూడిక తీత పనులు పూర్తి కావాలని మంత్రి కొండ సురేఖ అన్నారు. భద్రకాళి చెరువు పూడికతీత పనులను మేయర్, ఎమ్మెల్యే, కుడా ఛైర్మన్, కలెక్టర్లతో కలిసి పరిశీలించారు. ప్రతిరోజు చెరువు పూడికతీత పనులు కొనసాగుతున్నాయని, సోమవారం నుండి విద్యుత్ లైట్లను తగినంత సిబ్బందిని ఏర్పాటు చేసి, రాత్రి వేళల్లో కూడా మట్టి తరలింపు చేస్తామని కలెక్టర్ ప్రావీణ్య మంత్రికి వివరించారు.