News March 21, 2024
వై.పాలెం: గ్రామ సేవకుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు మృతి
గ్రామ సేవకుల సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గుర్రం నాగయ్య గురువారం మృతి చెందారు. బుధవారం సాయంత్రం నాగయ్య తన ఇంటి ముందు రోడ్డు దాటుతుండగా మోటారు సైకిల్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు యర్రగొండపాలెంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చేర్పించగా, చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతి విషయాన్ని తెలుసుకున్న గ్రామ సంఘం నాయకులు సంతాపం తెలిపారు.
Similar News
News September 20, 2024
ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే బూచేపల్లి?
ప్రకాశం జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా దర్శి ఎమ్మెల్యే డా.బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని శుక్రవారం వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇవాళ జిల్లాలోని నేతలు అందరితో సమావేశం నిర్వహించి చర్చించారు. అనంతరం జిల్లా నేతలు అందరూ బూచేపల్లిని సన్మానించారు. దీంతో ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి ఆయనకు ఇచ్చారని దర్శి నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
News September 20, 2024
CM సభా ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో, మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పర్యటన ప్రదేశాలను పరిశీలించారు. అధికారులకు తగు సూచనలు చేశారు. మంత్రితోపాటు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఉన్నారు.
News September 20, 2024
ఒంగోలు: కంప్యూటర్ ట్యాలీలో ఉచిత శిక్షణ
ఒంగోలు రూడ్ సెట్ సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్ 1 నుంచి 30వ తేదీ వరకు మహిళలకు కంప్యూటర్ ట్యాలీలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. జిల్లాకు చెందిన 19-45 ఏళ్ల వయస్సు గల నిరుద్యోగ మహిళలు అర్హులని అన్నారు. శిక్షణా కాలంలో భోజనం, వసతి సౌకర్యాలు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. వివరాలకు 4/11, భాగ్య నగర్, దామచర్ల సక్కుబాయమ్మ కాలేజ్ ఒంగోలులో సంప్రదించాలన్నారు.