News March 19, 2025
వై.రామవరం: పూడ్చిపెట్టిన మృతదేహానికి పోస్టుమార్టం

వై.రామవరం మండలం పెద్దఊలెంపాడులో మంగళవారం పూడ్చిపెట్టిన బాలుడి మృతదేహానికి ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోస్టుమార్టం జరిగింది. ఈ నెల8న 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో పెద్దఊలెంపాడుకు చెందిన జాస్విక్ రెడ్డి(3) మృతి చెందాడు. 9న మృతదేహాన్ని ఖననం చేశారు. గ్రామస్థుల సూచనతో బాలుడి తల్లి మార్చి 17వతేదీ రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి పోస్టుమార్టం చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.
Similar News
News December 1, 2025
కేరళ సీఎంకు ED నోటీసులు

2019 మసాలా బాండ్ల జారీ కేసులో కేరళ సీఎం పినరయి విజయన్‌కు ED నోటీసులు జారీ చేసింది. సీఎంతోపాటు ఆయన చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎం అబ్రహం, ఆర్థిక శాఖ మాజీ మంత్రి థామస్ ఇస్సాక్‌కు నోటీసులిచ్చింది. రూ.468 కోట్ల ట్రాన్సాక్షన్స్లో ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉల్లంఘించారనే ఆరోపణలపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు సమీకరించే ప్లాన్‌లో భాగంగా ఈ బాండ్లను జారీ చేశారు.
News December 1, 2025
హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 9,744 మందికిపైగా ఎయిడ్స్.!

ఎయిడ్స్ వచ్చిన సరే సాధారణ జీవితం గడపవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గత 5ఏళ్లలో హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 9,744 మందికిపైగా ఎయిడ్స్ వ్యాధి బారిన పడినవారు ఉన్నారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సమాజం ఈ లెక్కలు చెబుతోంది. వీటితోపాటు నివారణ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యాంటీరెట్రోవైరల్ థెరపీ ద్వారా ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. కాగా, నేడు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం.
News December 1, 2025
ఎయిడ్స్‌పై జాగ్రత్తే కవచం: మంత్రి దామోదర్

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి దామోదర్ రాజనరసింహ పిలుపునిచ్చారు. ఎయిడ్స్‌పై అపోహలు వీడి, అవగాహన పెంపొందించాలని, సమయానికి పరీక్షలు, సురక్షిత జీవనశైలి మాత్రమే రక్షణ మార్గమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గోప్యతతో ఉచిత చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు. వివక్షకు చోటు లేకుండా ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని మంత్రి ఆకాంక్షించారు.


