News November 24, 2024

వ్యక్తిగత డేటాను ఇవ్వకండి: తిరుపతి ఎస్పీ

image

సైబర్ నేరాలపై పోరాడుదామని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదివారం తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. మోసపూరిత ఈమెయిల్స్, లింకులతో సున్నితమైన సమాచారాన్ని దొంగలించడం, డబ్బులు కాజేయడం, దుష్ప్రచారం చేయడం వంటి నేరాలకు పాల్పడే వారిని నియంత్రిస్తామన్నారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత డేటాను చెప్పవద్దని ఎస్పీ సూచించారు.

Similar News

News December 2, 2024

తిరుపతి: అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం

image

తుఫాను ప్రభావంతో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో పోలీసు యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా అప్రమత్తంగా ఉన్నట్టు ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. వాగులు, వంకల వద్ద ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రోడ్లపై నేలవాలిన వృక్షాలను ఎప్పటికప్పుడు తొలగించేలా సిబ్బంది చర్యలు చేపట్టారన్నారు. అత్యవసర సమయాలలో 112/80999 99977కు సమాచారం ఇవ్వాలన్నారు.

News December 2, 2024

పెద్దమండెం: రైతుపై హత్యాయత్నం

image

రైతుపై ప్రత్యర్థులు హత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన ఆదివారం పెద్దమడెం మండలంలో చోటుచేసుకుంది. SI రమణ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బండమీదపల్లికి చెందిన లక్ష్మీనారాయణ(55) పొలంలో వేరే పొలానికి చెందిన వెంకటరమణ పాడి పశువులు పంట నష్టం చేశాయని ఇటీవల మందలించాడు. దీంతో కసి పెంచుకొన్న వెంకటరమణ తన అనుచరులతో దారికాసి కర్రలతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచి, హత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం.

News December 1, 2024

మహిళ ప్రాణాలను కాపాడిన తిరుపతి పోలీసులు

image

కుటుంబ సమస్యలతో తన భార్య తిరుపతికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపిందని వినుకొండకు చెందిన ఓ వ్యక్తి తిరుపతి ఎస్పీకి ఫోన్ చేసి వివరించారు. వెంటనే SP సుబ్బారాయుడు ఆదేశాలతో సిబ్బంది ఆమె ఫొటోతో విష్ణు నివాసం, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలించారు. చివరికి ప్లాట్ఫామ్ ట్రాక్ వద్ద ఆమెను గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం కుటుంబానికి సమాచారం అందించారు. దీంతో సిబ్బందిని SP అభినందించారు.