News July 29, 2024
వ్యక్తిగత దూషణలు సరికాదు: కామారెడ్డి ఎమ్మెల్యే

శాసనసభలో వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను పక్కనపెట్టి ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకోవడం ఎంతవరకు సమంజసం అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఈ ప్రభుత్వం సరి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు. గ్రామాలలో ప్రజలు ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు.
Similar News
News November 21, 2025
NZB: ఎన్నికల సాధారణ పరిశీలకునిగా శ్యాంప్రసాద్ లాల్

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం NZB జిల్లాకు ఎన్నికల పరిశీలకులను నియమించిందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాకు ఎన్నికల సాధారణ పరిశీలకునిగా వెనుకబడిన తరగతుల సంక్షేమ పాఠశాలల ప్రత్యేక అధికారి జీవీ.శ్యాంప్రసాద్ లాల్ను, ఎన్నికల వ్యయ పరిశీలకులుగా KMR జిల్లా ఆడిట్ అధికారి జె.కిషన్ పమర్ను నియమించినట్లు పేర్కొన్నారు.
News November 21, 2025
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు: NZB కలెక్టర్

రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తు.చా తప్పక పాటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని NZB కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి నోడల్ అధికారులను ఆదేశించారు. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా సమన్వయంతో పనిచేస్తూ, ఎన్నికలను సాఫీగా నిర్వహించాలని సూచించారు. అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉంటూ తమకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు.
News November 21, 2025
NZB: గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

రైలులో గుట్కా ప్యాకెట్లు తరలించేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు NZB రైల్వే సీఐ సాయిరెడ్డి తెలిపారు. GRP, RPF సిబ్బంది కలసి ఫ్లాట్ ఫారం నంబర్-1పై తనిఖీలు చేస్తుండగా NZB ఆటోనగర్కు చెందిన అబ్దుల్ అనీస్ నిషేధిత టోబాకో గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. మొత్తం 80 ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.


