News March 28, 2024
వ్యక్తిగత విమర్శలు చేయవద్దు: నెల్లూరు కలెక్టర్

ఎన్నికల ప్రచారాల్లో రాజకీయ నాయకులు వ్యక్తిగత విమర్శలు చేయకుండా, ఎన్నికల సంఘం నిబంధనలను పాటించాలని కలెక్టర్ కలెక్టర్ హరి నారాయణన్ తెలిపారు. బుధవారం ఉదయం నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్‌ఆర్ శంకరన్ వీసీ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఎన్నికల కోడ్ ను ప్రతి ఒక్కను పాటించాలన్నారు.
Similar News
News April 21, 2025
నెల్లూరు జిల్లాలో టీచర్ పోస్టులు ఇలా..!

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో డీఎస్సీ ద్వారా 668 పోస్టులు భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు.
➤ OC-264 ➤ BC-A:50 ➤ BC-B:61
➤ BC-C:8 ➤ BC-D:46 ➤ BC-E:26
➤ SC- గ్రేడ్1:10 ➤ SC-గ్రేడ్2:40
➤ SC-గ్రేడ్3:51 ➤ ST:43 ➤ EWS:65
➤ PH-విజువల్:2 ➤ PH- హియర్:2
NOTE: సబ్జెక్టుల వారీగా పోస్టుల కోసం <<16155982>>ఇక్కడ <<>>క్లిక్ చేయండి.
News April 21, 2025
నెల్లూరు: చెట్టును ఢీకొని ఇద్దరి మృతి

మర్రిపాడు మండలం కదిరి నాయుడుపల్లి వద్ద నిన్న <<16156996>>ప్రమాదం <<>>జరిగిన విషయం తెలిసిందే. కడప జిల్లా అట్లూరు మండలం ముత్తుకూరుకు చెందిన నరసింహులు(26), బద్వేల్‌లోని రూపవరం పేటకు చెందిన ఝాన్సీ(26) బైకుపై పెంచలకోనకో వచ్చారు. తిరిగి వెళ్తుండగా చెట్టును ఢీకొట్టారు. యువతి అక్కడికక్కడే మృతిచెందగా.. బద్వేలు ఆసుపత్రికి తరలిస్తుండగా యువకుడి మృతి చెందాడు. మర్రిపాడు ఎస్ఐ కేసు నమోదు చేశారు.
News April 20, 2025
నెల్లూరులో రాష్ట్రస్థాయి చెస్ పోటీలు ప్రారంభం

నెల్లూరు జిల్లా చెస్ అసోసియేషన్ శ్రీ ఆనంద్ చెస్ వింగ్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని సిల్వర్ బాక్స్ పాఠశాలలో రాష్ట్రస్థాయి చెస్ పోటీలను అప్సానాతో వెంకటాద్రి నాయుడు, చెస్ రాష్ట్ర కార్యదర్శి సుమన్ ఆదివారం ప్రారంభించారు. 280 మంది క్రీడాకారులు 2 ఉభయ రాష్ట్రాల నుంచి పోటీల్లో పాల్గొన్నారు. గెలుపొందిన విజేతకు నగదగతో పాటు, మెమొంటో, ప్రశంసా పత్రం అందజేస్తారని గోపీనాథ్, డాక్టర్ మధు తెలిపారు.