News December 3, 2024

వ్యక్తి తలపై కత్తితో దాడి: ఎస్ఐ జయబాబు

image

టీ.నర్సాపురం మండలం రాజుపోతేపల్లికి చెందిన నత్త నాగరాజుపై డిసెంబర్ 2న గుమ్మల్ల స్వామి అనే వ్యక్తి కత్తితో తలపై తీవ్రంగా దాడి చేసినట్లు ఎస్ఐ జయబాబు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. భూ వివాదాల నేపథ్యంలో హత్యాయత్నం జరిగిందన్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. లా అండ్ ఆర్డర్‌కు విఘాతం కలిగిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News March 17, 2026

భీమవరం: ‘ఎండ తీవ్రతను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి’

image

రాబోయే వేసవిలో ఎండ తీవ్రతను ఎదుర్కొనేందుకు అధికారులు ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉండాలి కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో భీమవరం కలెక్టరేట్లో సమీక్ష సోమవారం సమావేశాన్ని నిర్వహించారు. ప్రజలు అధికంగా రాకపోకలు చేసే ముఖ్య కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, పాఠశాలలు వంటి ప్రదేశాలను గుర్తించి అక్కడ తాగునీటి సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు.

News March 16, 2026

ప.గో: నేడు జిల్లా వ్యాప్తంగా ఎంతమంది పరీక్ష రాశారంటే..!

image

జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయని ప.గో డీఈఓ నారాయణ తెలిపారు. సోమవారం నిర్వహించిన తెలుగు పరీక్షకు 23,415 మంది విద్యార్థులు గాను 23,044 మంది విద్యార్థులు హాజరయ్యారని అన్నారు. 371 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని చెప్పారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని వెల్లడించారు.

News March 16, 2026

ప.గో: మొదటి పరీక్షకు 371 గైర్హాజరు