News September 25, 2024

వ్యక్తి హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు: సిరిసిల్ల SP

image

వ్యక్తి హత్య కేసులో ఇద్దరు నిందితుల్లో ఒకరికి జీవిత ఖైదు, రూ.2,500 జరిమానా, మరొకరికి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.2500 జరిమానా పడినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ తెలిపారు. ముస్తాబాద్‌కి చెందిన రాజంను ఆస్తుల తగాదాల్లో మరియమ్మ, ఆమె కుమారుడు మల్లేశం 01-09-2020న గొడ్డలితో నరికి చంపారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో నేడు సిరిసిల్ల ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత వారికి శిక్ష విధించినట్లు SP తెలిపారు.

Similar News

News November 28, 2025

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి: సీపీ

image

సర్పంచ్ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినందున శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు. ఇందులో భాగంగా గతంలో నేర చరిత్ర ఉన్న ఎన్నికల నేరస్థులను బైండోవర్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా ఎన్నికలు సజావుగా సాగేందుకు అవసరమైన అన్నీ చర్యలు చేపడతామని, ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు.

News November 28, 2025

KNR: శిశుగృహ, బాలసదనం నుంచి పిల్లల దత్తత

image

పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్‌ శిశు గృహంలో పెరుగుతున్న 4నెలల వయసున్న ఆడ శిశువును హుస్నాబాద్‌కు చెందిన పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకున్నారు. బాలసదనంలో ఆశ్రయం పొందుతున్న 13సం.ల బాలికను తమిళనాడుకు చెందిన పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకున్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ ఆధ్వర్యంలో కలెక్టర్ చేతుల మీదుగా దంపతులకు పిల్లలను దత్తత ఇచ్చారు.