News April 15, 2025
వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై పోలీసుల దాడి

ఏలూరు రామచంద్రరావు పేటలోని సెయింట్ థెరీసా చిన్నపిల్లల గేటు సందులో ఓ గృహంలో వ్యభిచారం జరుగుతుందనే సమాచారంతో రెండో పట్టణ సీఐ అశోక్ కుమార్ తన సిబ్బందితో కలిసి సోమవారం రాత్రి దాడి చేశారు. ఆ గృహంలో వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకురాలని, నిర్వాహకుడిని అరెస్టు చేశారు. ఒక బాధితురాలని గుర్తించారు. ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు. రెండు వేల నగదు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News November 25, 2025
హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి: సిద్దరామయ్య

CM మార్పు విషయంలో గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలని కర్ణాటక సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. ఢిల్లీకి వెళ్లే స్వేచ్ఛ ఎమ్మెల్యేలకు ఉందని, వారు తమ అభిప్రాయాలు చెప్పుకోవచ్చని అన్నారు. అధిష్ఠానం నుంచి సిగ్నల్ రాగానే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపడతామని పేర్కొన్నారు. మరోవైపు తాను పార్టీ నుంచి ఏమీ డిమాండ్ చేయడం లేదని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పారు.
News November 25, 2025
UIDAIలో టెక్నికల్ కన్సల్టెంట్ ఉద్యోగాలు

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(<
News November 25, 2025
నల్గొండ: రైతు భరోసా కోసం రైతుల ఎదురుచూపులు

నల్గొండ జిల్లాలో యాసంగి పంట సాగుకు సిద్ధమవుతున్న 10.82 లక్షల మంది రైతులు రైతు భరోసా పథకం పెట్టుబడి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వానాకాలం, యాసంగి పంటలకు కలిపి ప్రభుత్వం ఏటా రూ.12,000 అందిస్తుంది. అయితే, ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో విడుదల కావాల్సిన ఈ యాసంగి సహాయం ఇప్పటివరకు రాకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.


