News November 13, 2024

వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి తుమ్మల సమావేశం

image

వ్యవసాయ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించడానికి కావాల్సిన నిధులు, పథక అమలు తీరుతెన్నులపై చర్చించారు. వ్యవసాయ కార్యదర్శి రఘునందన రావు, డైరెక్టర్ గోపి, సహకార సంస్థల ప్రతినిధులలు పాల్గొన్నారు. ఈ యాసంగి నుంచి రైతులకు అవసరమైన పనిముట్లను, యంత్రాలను, సబ్సిడీపై సరఫరా చేయడానికి ప్రణాళిక సిద్దం చేసామని వ్యవసాయశాఖ డైరెక్టర్ శ్రీ గోపి తెలిపారు.

Similar News

News December 6, 2025

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు

image

బాబ్రీ మసీదు కూల్చివేత రోజు (డిసెంబర్ 6) సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. సీపీ సునీల్ దత్ ఆదేశాల మేరకు అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో పోలీసులు ముందస్తు తనిఖీలు చేపట్టారు. ప్రజలు వదంతులు నమ్మవద్దని అధికారులు సూచించారు. అనుమానిత వ్యక్తులు, సామాజిక మాధ్యమాల్లో పుకార్లు వ్యాప్తి చేసే వారిపై నిఘా ఉంచినట్లు తెలిపారు.

News December 6, 2025

మూడో విడత ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల స్వీకరణ

image

ఖమ్మం జిల్లాలో మూడో విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. 7 మండలాల్లోని 191 గ్రామ పంచాయితీలకు గాను మొత్తం 1025 మంది సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. ఏన్కూరు S-109, కల్లూరు S-124, పెనుబల్లి S-158, సత్తుపల్లి S-106, సింగరేణి S-157, తల్లాడ S-145, వేంసూరు 126 మంది సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు వేశారు. కాగా నేటి నుంచి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరగనుంది.

News December 6, 2025

పాలేరు జలాశయంలో మత్స్యకారుడు మృతి

image

కూసుమంచి మండలం పాలేరు జలాశయంలో చేపల వేటకు వెళ్లి ఎర్రగడ్డ తండాకు చెందిన బానోత్ వాల్య(65)అనే మత్స్యకారుడు మృతి చెందాడు. తండావాసుల కథనం ప్రకారం.. శుక్రవారం సాయంత్రం చేపల వేటకు వెళ్లిన వాల్యకు చేపల వలలు కాళ్లకు చుట్టుకుని నీటిలో మునిగి పోయాడు. ఈరోజు ఉదయం గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.