News November 4, 2024

వ్యవసాయ క్షేత్రంలో మంత్రి తుమ్మల

image

పాలన, పార్టీ కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉండే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన స్వగ్రామమైన దమ్మపేట మండలం గండుగులపల్లిలోని తమ వ్యవసాయ క్షేత్రంలో సోమవారం ఉదయం కాసేపు గడిపారు. పచ్చని పంట పొల్లాల్లో కలియ తిరుగుతూ ప్రకృతిని ఆస్వాదించారు. ఆయిల్‌ పామ్‌ సాగులో ఇంకా తీసుకోవాల్సిన చర్యలు, సస్య రక్షణ పద్ధతుల గురించి కూలీలతో చర్చించారు.

Similar News

News December 8, 2024

KMM: ఆర్టీసీ ఏసీ బస్సుల్లో 10% రాయితీ

image

టిజిఎస్ ఆర్టీసీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఏసీ బస్సుల్లో బేసిక్ టికెట్ చార్జిపై 10% రాయితీ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఖమ్మం జిల్లా రీజినల్ మేనేజర్ సరి రామ్ తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి ఏసీ బస్సులు ఉన్న అన్ని రూట్‌లలో రాయితీ ఈ నెల 31 వరకు వర్తిస్తుందని తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. సీట్ బుకింగ్ కొరకు www.tgsrtcbus.in సంప్రదించాలన్నారు. 

News December 8, 2024

క్షేత్ర స్థాయి డాటా సేకరణలో పొరపాట్లు జరగొద్దు: జిల్లా కలెక్టర్

image

ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా క్షేత్ర స్థాయి డాటా సేకరణలో పొరపాట్లకు తావులేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో MROలు, MPDOలు, MPOలు, మునిసిపల్ కమిషనర్ లకు ఇందిరమ్మ ఇండ్ల యాప్ పై ఏర్పాటుచేసిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, అధికారులకు అవగాహన కల్పించారు. రొటీన్ కార్యక్రమంలా భావన వద్దని, ఒక పేదవారికి శాశ్వత ఇంటి హక్కు ఇస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

News December 7, 2024

ఇళ్ల లబ్ధిదారుల వివరాలను యాప్లో ఎంట్రీ చేస్తాం: పొంగులేటి

image

ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి లబ్ధిదారుల వివరాలను యాప్‌లో ఒకేసారి ఎంట్రీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. అందులో నుంచే దశలవారీగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. గత పాలకులు ధరణి పేరుతో ప్రభుత్వ భూములను కబ్జా చేశారని, వాటిపై విచారణ చేస్తున్నామని తెలిపారు. అసైన్డ్ భూముల హక్కులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.