News June 24, 2024
వ్యవసాయ పనుల్లో నిమగ్నం

రుతు పవనాలకు తోడు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆలస్యంగా కురుస్తున్న వర్షాలతో ఖరీఫ్ పనులు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే పొలాల దుక్కులు చదును చేసి విత్తనం నాటేందుకు సిద్ధంగా ఉన్న రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే 1,18,286 ఎకరాల్లో పత్తి విత్తనాలు వేయగా, నీటి వసతులు ఉన్న చోట్ల 8,512 ఎకరాల్లో వరి నాట్లు వేశారు.
Similar News
News July 10, 2025
మత్స్య రైతుల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు: అ.కలెక్టర్

మత్స్య రైతుల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి అన్నారు. అదనపు కలెక్టర్, జాతీయ మత్స్య రైతుల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మత్స్య రైతులకు బీమా, కిసాన్ క్రెడిట్ కార్డుల మంజూరు, ఇతర సదుపాయాల కల్పనను కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు.
News July 10, 2025
ఖమ్మం శివారులో యాక్సిడెంట్

బైక్‌పై వెళుతూ ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందగా, మరో యువకుడికి గాయాలైన ఘటన ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లిలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఇద్దరు యువకులు బైక్‌పై ఖమ్మం వైపు వెళుతూ డివైడర్‌ను ఢీకొట్టారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News July 10, 2025
ఖమ్మం: సీఎంఆర్ రిక‘వర్రీ’

జిల్లాలోని 66 మిల్లర్లు ప్రభుత్వానికి సకాలంలో సీఎంఆర్ బియ్యంను అందించడంలో విఫలమవుతున్నారు. 2024-25 యాసంగి సీజన్‌లో ఇప్పటివరకు ప్రభుత్వానికి 60% మాత్రమే అందించారు. ఈ సీజన్లో 4,55,981,360 మె.ట ధాన్యాన్ని మిల్లర్లకు ఇవ్వగా, 1,84,444,836 మె.ట బియ్యంను అప్పగించారు. మరో 1,21,298,515 మె.ట అందజేయాల్సి ఉండగా.. ఈ ఏడాది SEPతో గడువు ముగియనుంది. పెండింగ్ సీఎంఆర్‌పై అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాలి.