News June 19, 2024
వ్యవసాయ పాలిటెక్నిక్ ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం

ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆమదాలవలస మండలం తొగరం గ్రామంలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.పైడి వెంకట్రావు తెలిపారు. దరఖాస్తు చేసేందుకు ఈనెల 30వ తేదీ వరకు గడువును పెంచుతున్నట్లు చెప్పారు. పదో తరగతి సప్లిమెంటరీ విద్యార్ధుల వినతి మేరకు దరఖాస్తు గడువును పొడిగించామన్నారు.
Similar News
News January 6, 2026
రోడ్డు ప్రమాదంలో సిక్కోలు వాసి మృతి

విజయనగరం జిల్లా పూసపాటిరేగ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నందిగం మండలం కాపుతెంబూరు గ్రామానికి చెందిన జీ.నగేశ్ (30) అనే యువకుడు దుర్మరణం చెందారు. విజయవాడ నుంచి లగేజీ వ్యాన్‌పై టెక్కలి వైపు సామాగ్రి తీసుకువస్తుండగా రోడ్డుపక్కన బండి ఆపి రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
News January 6, 2026
SKLM: సముద్రంలో బోటు బోల్తా.. మత్స్యకారుడి మృతి

వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడా గ్రామానికి చెందిన చెక్క గోపాలరావు (42) మంగళవారం సముద్రంలోకి వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఎప్పటిలాగే తోటి మత్స్యకారులతో ఫైబర్ బోటుపై వేటకు వెళ్లారు. అలల తాకిడికి బోటు బోల్తా పడటంతో మృతి చెందాడని స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
News January 6, 2026
SKLM: గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు..మూడు రోజులే ఛాన్స్

శ్రీకాకుళం జిల్లాలోని ఏపీ మోడల్ స్కూల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా పోస్టులకు విద్యాశాఖ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. లావేరు, పొందూరు, పోలాకి, జలుమూరు, పాతపట్నం, సోంపేట, కంచిలి, కవిటి, ఇచ్ఛాపురంలో మండలాల్లో మొత్తం 15 ఖాళీలకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. JAN6- 8తేదీల లోపు ఆయా స్కూల్స్‌కు దరఖాస్తులను అందజేయాలని DEO రవిబాబు పేర్కొన్నారు. రూ.12 వేలు వేతనం ఇవ్వనున్నారు.


