News June 20, 2024
వ్యవసాయ పాలిటెక్నిక్ ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం
ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆమదాలవలస మండలం తొగరం గ్రామంలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.పైడి వెంకట్రావు తెలిపారు. దరఖాస్తు చేసేందుకు ఈనెల 30వ తేదీ వరకు గడువును పెంచుతున్నట్లు చెప్పారు. పదో తరగతి సప్లిమెంటరీ విద్యార్ధుల వినతి మేరకు దరఖాస్తు గడువును పొడిగించామన్నారు.
Similar News
News September 18, 2024
నరసన్నపేట: వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం
నరసన్నపేట మండలం దూకులపాడు పంచాయతీ తండ్యాలవానిపేటకు చెందిన శిమ్మ దివ్య అత్తింటి వేధింపులు కారణంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు హుటాహుటిన నరసన్నపేటలోని ఓ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి మంగళవారం రాత్రి తరలించారు. దివ్య తల్లి ఆదిలక్ష్మి నరసన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఎస్సై దుర్గా ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టమన్నారు.
News September 18, 2024
శ్రీకాకుళం: వంద రోజుల కార్యాచరణ లక్ష్యాలపై సమీక్ష
అభివృద్ధికి అవకాశం ఉన్న అన్ని రంగాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు అధికారులంతా చిత్తశుద్ధితో పని చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. కీలక శాఖల 100 రోజుల కార్యాచరణ నివేదికలపై శాఖల వారీగా ఉన్నతాధికారులతో శ్రీకాకుళంలో బుధవారం దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో 100 రోజుల పనుల ప్రగతి, లక్ష్యాలపై జాయింట్ కలెక్టర్‌తో కలిసి అధికారులకు పలు సూచనలు చేశారు. అందరూ లక్ష్యాలను చేరుకోవాలన్నారు.
News September 17, 2024
శ్రీకాకుళం: రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే చర్యలు తప్పవు-DM&HO
జిల్లాలో నడుపబడుచున్న ఆసుపత్రులు, క్లినిక్‌లు, ల్యాబ్‌లు తప్పనిసరిగా (ఆన్‌లైన్)లో రిజిష్టర్ చేసుకోవాలని DM&HO డా.మీనాక్షి ఒక ప్రకటనలో మంగళవారం కోరారు. రిజిస్ట్రేసన్ చేసుకోకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. రిజిస్ట్రేషన్/రెన్యువల్ లేని వారు వెంటనే ఆన్‌లైన్‌లోని https:/ /clinicalesttact.ap.gov.in/ రిజిస్ట్రేసన్ చేసుకోవాలన్నారు. అలాగే స్కానింగ్ సెంటర్‌లో లింగ నిర్ధారణ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.