News February 1, 2025
వ్యవసాయ యోగ్యం కాని భూముల్లో సోలార్ ప్లాంట్‌లు

వ్యవసాయయోగ్యం కాని భూముల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్‌ల ఏర్పాటుకు రైతులు ముందుకు రావాలని ఖమ్మం SE సురేందర్ కోరారు. 500 కిలోవాట్ల నుంచి 4వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్‌లు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ప్లాంట్‌లలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను TGERC నిర్ణయించిన టారిఫ్ ఆధారంగా విద్యుత్ డిస్కంలు కొనుగోలు చేస్తాయన్నారు. www.tgredco.telangana.gov.inవెబ్‌సైట్‌లో 22లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News October 30, 2025
క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలి: సీఎం

ఖమ్మం: మొంథా తుఫాన్ నేపథ్యంలో మంత్రులు, అధికారులు ప్రభావిత ప్రాంతాలలో క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉంటూ ప్రజలను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్ దత్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య పాల్గొన్నారు. వరదల నేపథ్యంలో విద్యుత్ పునరుద్ధరణ యుద్ధ ప్రాతిపదికన జరిగేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు.
News October 30, 2025
పునరావాస కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ అనుదీప్

ఖమ్మం: మున్నేరు వాగు ఉధృతి నేపథ్యంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం పరిశీలించారు. నయాబజార్ స్కూల్, జూనియర్ కళాశాల శిబిరాల్లోని వసతులు, భోజనం నాణ్యత, హెల్త్ క్యాంప్‌ల నిర్వహణపై ఆయన ఆరా తీశారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలకు ఇబ్బంది లేకుండా మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
News October 30, 2025
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ సెలవులు రద్దు

ఖమ్మం జిల్లాలో వర్ష ప్రభావం తగిన నేపథ్యంలో (రేపు) శుక్రవారం తిరిగి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ప్రారంభమవుతుందని ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు. రైతుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని తుఫాను ప్రభావం తగ్గి వాతావరణం పొడిగా ఉన్నందున మార్కెట్ను తిరిగి రేపు ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. కావున రైతాంగ సోదరులు గమనించి తమ పంటలను మార్కెట్‌కు తీసుకువచ్చి అమ్మకాలు జరపాలని అధికారులు పేర్కొన్నారు.


