News December 11, 2024
వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రేపటి నుంచి జాతీయ సదస్సు
రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్‌ప్లాంట్ పాథాలజీ అండ్ ప్లాంట్ ఇన్నోవేటివ్ అప్రోచెస్ ఇన్‌ప్లాంట్ డిసీజ్ మేనేజ్‌మెంట్ (RAPPID)అంశంపై రేపటినుంచి 2 రోజుల పాటు రాజేంద్రనగర్‌లోని జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జాతీయ సదస్సు జరగనుంది. దీన్ని ఇండియన్ ఫైటోపాథాలాజికల్ సొసైటీ (సెంట్రల్ జోన్), దక్కన్ సొసైటీ ఆఫ్ ప్లాంట్ పాథాలజీలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
Similar News
News January 23, 2025
HYD ఎయిర్‌పోర్ట్‌లో సందర్శకులకు నో ఎంట్రీ
గణతంత్ర వేడుకలు సమీపిస్తున్న వేళ అధికారులు అప్రమత్తమయ్యారు. శంషాబాద్ విమానాశ్రయంలో సందర్శకులకు నో ఎంట్రీ అని బోర్డ్ పెట్టారు. ఈ నెల 30 వరకు అనుమతి ఇవ్వమన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా అంతర్జాతీయ విమానాశ్రయాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో RGIAలోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. ప్యాసింజర్ వెంట ఒకరు, ఇద్దరు మాత్రమే రావాలని సూచించారు. SHARE IT
News January 23, 2025
సికింద్రాబాద్ రైల్వేలో ఉద్యోగాలు
SCRలో ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. RRB గ్రూప్ D నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 32,438 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇందులో SCR పరిధిలో 1642 ఖాళీలు ఉన్నాయి. స్పెషల్ క్యాటగిరీలో మరో 710 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. వేతనం రూ. 18000 ఉంటుంది. వయస్సు: 18-36 మధ్య ఉండాలి. నేటి నుంచి ఫిబ్రవరి 22 వరకు అప్లై చేసుకోవచ్చు. అర్హత: 10th, ITI ఉత్తీర్ణత.
SHARE IT
News January 23, 2025
ఓయూలో పీజీ దూరవిద్య పరీక్ష ఫలితాలు విడుదల
ఓయూలో దూరవిద్య పరిధిలోని వివిధ పీజీ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. M Com, MA, Msc తదితర కోర్సుల మొదటి, రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.