News October 10, 2024
వ్యాపార దిగ్గజం రతన్ టాటాకు శ్రీసిటీ ఎండీ ఘన నివాళి
గొప్ప దార్శినికతకు, భారతీయ పరిశ్రమకు, దాతృత్వానికి మారుపేరైన టాటా సన్స్ గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ నావల్ టాటా మృతి పట్ల శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆ మహోన్నత వ్యక్తికి ఘనంగా నివాళులు అర్పిస్తూ, తరతరాలకు స్ఫూర్తినిచ్చే దార్శనికుడిని భారతదేశం కోల్పోయిందని పేర్కొన్నారు. 2019 ఏప్రిల్ 16న రతన్ టాటా శ్రీ సిటీని సందర్శించారు.
Similar News
News December 22, 2024
చిత్తూరు: తండ్రే హత్య చేయించాడు.?
పుంగనూరు(M) లక్ష్మీపురం అటవీ ప్రాంతంలో శనివారం ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడిని మదనపల్లె(M) గుంపులపల్లె సోమశేఖర్రెడ్డి(36)గా పోలీసులు గుర్తించారు. తాగుడుకు బానిసై కుటుుబీకులను వేధిస్తుండటంతో అతడి తండ్రే సుపారి ఇచ్చి హత్య చేయించినట్లుగా గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేశారు. నిందితుల మధ్య డబ్బు కోసం గొడవ జరగ్గా ఈ విషయం బయటికి పొక్కినట్లు తెలుస్తోంది. సీఐ శ్రీనివాస్ కేసు నమోదు చేశారు.
News December 22, 2024
చిత్తూరు: నేటి నుంచి టీచర్లకు కౌన్సెలింగ్
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని మున్సిపల్, కార్పొరేషన్ పాఠశాలల్లో పనిచేస్తున్న పలు కేడర్ టీచర్లకు నేడు, రేపు (ఆది, సోమవారం) ప్రమోషన్ల కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు DEO వరలక్ష్మి తెలిపారు. స్కూల్ అసిస్టెంట్లకు HMగా, ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి కల్పించనున్నట్లు తెలిపారు. సీనియార్టీ జాబితాను ఇప్పటికే ఎంఈఓలకు పంపామన్నారు.
News December 21, 2024
బైరెడ్డిపల్లి: డెంగ్యూతో విద్యార్థిని మృతి
బైరెడ్డిపల్లి మండలం ఓటేరిపాలెం గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని డెంగ్యూ జ్వరంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గుణశేఖర్ కుమార్తె రక్షిత 6వ తరగతి చదువుతోంది. పది రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఎంతకీ జ్వరం తగ్గకపోవడంతో తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు కుటుంబీకులు పేర్కొన్నారు.