News October 25, 2024

శంకరపట్నం: ‘అంగన్వాడి కేంద్రాల్లో నాణ్యమైన ఆహారం సద్వినియోగం చేసుకోవాలి’

image

శంకరపట్నం మండలం ఎరడపల్లి అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం ఐసీడీఎస్ సూపర్వైజర్ స్రవంతి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల స్పెషల్ ఆఫీసర్ నాగార్జున, పీహెచ్సీ డాక్టర్ శ్రావణ్ హాజరయ్యారు. నాగార్జున మాట్లాడుతూ.. పిల్లల సంరక్షణకై అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన ఆహారం అందిస్తుందన్నారు. డా.శ్రావణ్ మాట్లాడుతూ.. గర్భిణీలకు, స్త్రీలకు, పోషకాహారంపై అవగాహన కల్పించారు.

Similar News

News November 14, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బాలల దినోత్సవం. @ గన్నేరువరం మండలంలో ట్రాక్టర్ రోటవేటర్ లో ఇరుక్కుని వ్యక్తి మృతి. @ మానకొండూరు మండలంలో తాటి చెట్టు పైనుండి పడి గీత కార్మికుడి మృతి. @ భీమారం మండలంలో నృత్యం చేస్తుండగా కుప్పకూలి మృతి చెందిన యువకుడు. @ ముగ్గురు సైబర్ క్రిమినల్స్ ను అరెస్ట్ చేసిన మెట్పల్లి పోలీసులు. @ జగిత్యాలలో దిశా సమావేశంలో పాల్గొన్న ఎంపీ అరవింద్.

News November 14, 2024

కరీంనగర్: గ్రూప్-3 ప్రశ్న పత్రాలకు కట్టుదిట్టమైన బందోబస్తు

image

గ్రూప్‌-3 పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు, ఇతర మెటీరియల్‌ను కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపరిచినట్లు అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. కరీంనగర్లోని స్ట్రాంగ్ రూములను పరిశీలించారు. ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమిస్తామన్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని వివరించారు.

News November 14, 2024

KNR: పిల్లలు దైవానికి ప్రతిరూపాలు: కలెక్టర్

image

పిల్లలు దైవానికి ప్రతిరూపమని, వారిని సన్మార్గంలో నడిపిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకొని.. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో బాలల దినోత్సవం వేడుకలను గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. 80 శాతం పిల్లల భవిత ఉపాధ్యాయుల చేతుల్లో ఉందని అన్నారు.