News February 15, 2025

శంకరపట్నం: తాటిచెట్టు పైనుంచి పడిన గీత కార్మికుడు

image

తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని కరీంపేటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుర్రం వీరాస్వామి శనివారం సాయంత్రం గ్రామ శివారులోని ఓ తాటి చెట్టుపై కల్లు గీసి దిగుతుండగా కిందపడినట్లు స్థానికులు తెలిపారు. అతడు తీవ్రంగా గాయపడటంతో వెంటనే అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.

Similar News

News October 17, 2025

KNR: ‘బంద్ ఫర్ జస్టిస్’కు ఏఐఎస్‌ఎఫ్ మద్దతు

image

‘బంద్ ఫర్ జస్టిస్’ తెలంగాణ బంద్‌కు తమ సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఏఐఎస్‌ఎఫ్ (AISF) రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి కరీంనగర్‌లో ప్రకటించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే, వెంటనే గవర్నర్, రాష్ట్రపతి చేత ఆమోదింపజేసి 9వ షెడ్యూల్‌లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ బంద్ ద్వారానైనా బీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని ఆయన కోరారు.

News October 17, 2025

కరీంనగర్‌లో స్వదేశీ ఉత్సవ్ మేళా

image

కరీంనగర్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం ‘స్వదేశీ ఉత్సవ్ – క్యాంపస్ ఎకో బజార్ ఫర్ స్వదేశీ దీపావళి ఫెరియా ఫెస్తా’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యు.ఉమేష్ కుమార్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపల్ కె. రామకృష్ణ, ప్రిన్సిపాల్ వరలక్ష్మి, అధ్యాపకులు, విద్యార్థులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.

News October 17, 2025

దళారులను నమ్మి మోసపోవద్దు: కవ్వంపల్లి

image

శంకరపట్నం మండలం తాడికల్, కేశవపట్నంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ తాడికల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మానకొండూరు MLA కవ్వంపల్లి సత్యనారాయణ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధరకు ధాన్యం అమ్మాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 325 కేంద్రాల్లో కొనుగోలు కొనసాగుతుందని తెలిపారు.