News February 18, 2025
శంఖవరంలో భర్తపై కత్తితో దాడి చేసిన భార్య

శంఖవరం మండలం పెదమల్లాపురంలో సోమవారం రాత్రి దారుణం చోటుచేసుకొంది. కట్టుకున్న తన భర్త వంటల జ్ఞానేశ్వరరావుపై అతని భార్య కత్తితో దాడి చేసింది. చావు బతుకుల మధ్య కేకలు పెడుతున్న అతనిని చూసి స్థానికులు హుటాహుటిన 108 సహాయంతో ప్రత్తిపాడు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ మొదలు పెట్టారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 10, 2026
వరల్డ్ టాప్-2%లో నెల్లూరు శాస్త్రవేత్త

ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో వరుసగా ఐదోసారి నెల్లూరు శాస్త్రవేత్త డాక్టర్ అనుముకొండ వరదరాజులు చోటు సంపాదించారు. ఆయనను జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు సత్కరించారు. 75 ఏళ్ల వయసులో పసుపు, గోమూత్రం వంటి ప్రకృతి సిద్ధ పదార్థాలతో క్యాన్సర్ కణాలను నిరోధించే ‘నానో-మెడిసిన్’పై ఆయన పరిశోధనలు చేస్తున్నారు. ఆయన సాధించిన అంతర్జాతీయ పేటెంట్లు జిల్లాకు గర్వకారణమని జేసీ కొనియాడారు.
News April 10, 2026
వికారాబాద్: ఈనెల 13న నేషనల్ అప్రెంటిస్ మేళా

ప్రభుత్వ పారిశ్రామిక సంస్థ ఏటీసీ ఐటీఐలలో నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు వికారాబాద్ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ నరేంద్రబాబు తెలిపారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఐటీఐలో ఈనెల 13న ఉదయం 10 గంటలకు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా జరుగుతుందన్నారు. ఈ మేళాలో వివిధ కంపెనీల యజమాన్యాలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని, ఐటీఐ చేసినవారు హాజరు కావొచ్చన్నారు. మరిన్ని వివరాలకు 9177472488ను సంప్రదించవచ్చు.
News April 10, 2026
ముద్దు ముచ్చట తీరకముందే బకెట్ తన్నేస్తారా?

పెళ్లి, పిల్లల ముద్దుముచ్చట్లు, రిటైర్మెంట్ లైఫ్.. ఇవన్నీ అనుభవించాల్సిన జీవితాన్ని నేటి యువత చేజేతులా నాశనం చేసుకుంటోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘గంటల తరబడి కూర్చొని పని చేయడం, జంక్ ఫుడ్, ఒత్తిడి తగ్గాలని స్మోకింగ్, నిద్ర కోసం మద్యం సేవించడం ప్రాణాంతకం. సంపూర్ణమైన జీవితం గడపాలంటే తక్షణమే జీవనశైలి మార్చుకోండి. ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోండి’ అని డాక్టర్లు సూచిస్తున్నారు.


